Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో ఘోరం.. లైవ్‌లోనే పెట్రోల్ పోసి నిప్పంటించిన మాజీ భర్త...

Webdunia
శుక్రవారం, 2 అక్టోబరు 2020 (13:35 IST)
చైనాలో ఘోరం జరిగింది. ఫేమస్ పాటలకు లిప్ సింక్ చేస్తూ.. సోషల్ మీడియాలో లిప్ సింక్ చేస్తూ అభిమానులను అలరించే.. లాము వ్లాగర్ మాజీ భర్త చేతిలోనే దారుణ హత్యకు గురైంది. పదునైన కత్తితో తలుపులు బద్ధలు కొట్టి.. ఆమె ఇంట్లోకి చొరబడిన మాజీ భర్త.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆమె వీడియో చేస్తున్న సమయంలో లైవ్‌లోనే ఇదంతా జరిగింది. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఈ ఘోరం జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. సిచువాన్‌లోని ఓ గ్రామానికి చెందిన 30 ఏళ్ల లాము అనే మహిళ.. భర్తతో విడిపోయి తల్లిదండ్రులో ఉంటోంది. చైనీస్ టిక్ టాక్ వర్షన్‌ 'డోయిన్'లో వీడియోలు కాలక్షేపం చేసేది. మొదల కాలక్షేపం కోసం చేసినప్పటికీ.. ఆ వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ఆమెకు పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ప్రస్తుతం డోయిన్‌లో లాముకు 7.82 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. ఆమె వీడియోలకు ఇప్పటి వరకు 63 లక్షల లైక్స్ వచ్చాయి. 
 
ఐతే సెప్టెంబరు 14న ఇంట్లో డోయిన్ లైవ్ చేస్తుండగా ఆమె మాజీ భర్త చొరబడ్డాడు. పెద్ద కత్తితో తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. వెంట తెచ్చిన పెట్రోల్‌ను లాముపై పోసి నిప్పటించాడు. ఆ దృశ్యాలు డోయిన్‌లో లైవ్‌లో ప్రసారమయ్యాయి. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. మంటల్లో కాలిపోవడంతో లాముకు తీవ్ర గాయాలయ్యాయి. 
 
స్థానికులు ఆమెను హుటాహుటిన సిచువాన్ పబ్లిక్ ఆస్పత్రికి తరలించారు. 90 శాతం కాలిన గాయాలు కావడంతో 15 రోజుల పాటు ప్రాణాలతో పోరాడి ఓడిపోయింది లాము. సెప్టెంబరు 30న ఆమె తుది శ్వాస విడిచింది. ఈ ఘటన సిచువాన్ ప్రావిన్స్‌లో ప్రకంపనలు రేపింది. నిందితుడిని చంపేయాలని ఆమె అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఐతే ఘటన జరిగిన రోజే లాము మాజీ భర్తను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments