Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలెక్కండి... నచ్చిన భాగస్వామిని ఎంచుకోండి?

Webdunia
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (09:43 IST)
సాధారణంగా రైలు ప్రయాణం అంటే అపసోపాలు పడాల్సిందే. రిజర్వేషన్ చేసుకున్నప్పటికీ సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశం లేదు. కానీ, ఆ దేశంలో తిరిగే రైలులో మాత్రం సాఫీగా ప్రయాణం చేయడమే కాదు.. మనకు నచ్చిన భాగస్వామిని కూడా ఎంచుకోవచ్చు. ఈ స్కీమ్‌ను ఆ దేశ ప్రభుత్వమే అధికారికంగా ప్రవేశపెట్టింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, చైనాలో లవ్ ఎక్స్‌ప్రెస్ పేరిట ఓ కొత్త రైలును ప్రవేశపెట్టారు. తమకు సరైన జీవిత భాగస్వామిని ఎంచుకునే అవకాశం కల్పిస్తూ ఈ రైలును ప్రవేశపెట్టారు. ఎంపిక చేసిన 1000 మంది యువకులు, 1000 మంది యువతులు ఈ రైల్లో ప్రయాణించి, తమ జీవిత భాగస్వామిని వెతుక్కోవచ్చని ప్రచారం చేస్తోంది.
 
చైనా మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం పది బోగీలు ఉండే ఈ ఎక్స్‌ప్రెస్ రైలులో మ్యాచ్ మేకింగ్ సర్వీస్‌లను అందిస్తుంది. మూడేళ్ల క్రితం ఈ తరహా రైలును అధికారులు నడుపగా, మూడు వేలకు పైనా యువతీ యువకులు ప్రయాణించారు. వీరిలో పలువురు వివాహం చేసుకోగా, మరింతమంది రిలేషన్‌ షిప్‌ కొనసాగిస్తున్నారు.
 
ఈ రైలులోనే తమకు ప్రియురాలు లభించిందని, భార్య దొరికిందని చెప్పేవారి సంఖ్య ఇప్పుడు చైనాలో క్రమంగా పెరుగుతోంది. దేశంలో జనాభా పెరిగిపోవడంతో 1970 నుంచి నియత్రణ విధానాలను అమలు చేస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు వృద్ధుల సంఖ్య పెరిగిపోయి, యువత సంఖ్య తగ్గడంతో, నిబంధనలను సడలించి, జనాభాను పెంచేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments