Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసూద్ అజహర్‌పై మాకు ఎందుకంటే అంత ప్రేమ... క్లారిటీ ఇచ్చిన చైనా

నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ పట్ల చైనా అమిత ప్రేమను చూపించడానికి కారణాలను సూచన ప్రాయంగా వెల్లడించింది. మసూద్‌పై భిన్నాభిప్రాయాలు ఉన్నందుకే తాము మసూద్‌ను ఉగ్రవాదిగా ప్రకటించాలన

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2016 (09:58 IST)
నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ పట్ల చైనా అమిత ప్రేమను చూపించడానికి కారణాలను సూచన ప్రాయంగా వెల్లడించింది. మసూద్‌పై భిన్నాభిప్రాయాలు ఉన్నందుకే తాము మసూద్‌ను ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత డిమాండ్‌ను అడ్డుకున్నామని తెలిపింది. 
 
వీటో పవర్ ఉన్న చైనా ఐక్యరాజ్యసమితి వేదికగా మసూద్‌ను ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత యత్నాలను అడ్డుకున్న విషయం తెల్సిందే. తొలుత సాంకేతిక కారణాలు చెప్పి మరో 6 నెలల పాటు పాత నిర్ణయానికే కట్టుబడినట్లు యూఎన్‌కు వెల్లడించింది. మళ్లీ ఇప్పుడు భిన్నాభిప్రాయాలంటోంది. ఈ విషయంలో ఆయా దేశాలు తగిన చర్చలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చేందుకు మరో ఆరు నెలల గడువు తీసుకున్నట్లు తెలిపింది. 
 
దీనికి స్పష్టమైన కారణాలు లేకపోలేదు. పీఓకేలో ఆర్థిక కారిడార్ నిర్మిస్తున్న చైనా దీర్ఘకాలిక లక్ష్యాల్లో భాగంగా పాక్‌తో సత్సంబంధాలు కోరుకుంటోంది. యుద్ధం అంటూ వస్తే పీఓకే నుంచి భారత్‌పై దాడి చేసేందుకు సులువుగా ఉంటుందని భావించిన చైనా... పాకిస్థాన్‌కు అన్ని విధాల సహాయ సహకారాలందిస్తోంది. 
 
ఆర్థిక సంబంధాలే కీలక పాత్ర పోషిస్తున్న ప్రస్తుత తరుణంలో చైనాకు పాకిస్థాన్ కన్నా భారతే ఎక్కువ అవసరం. అందుకే మసూద్‌ పట్ల చైనా ప్రేమను కురిపిస్తోంది. అయితే, మసూద్ వంటి ఉగ్రవాదిని చైనా నాయకత్వం వెనకేసుకురావడం పరిశీలకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments