Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాపై పోరాటం.. భారత్‌కు సాయం చేసేందుకు సిద్ధం.. చైనా

Webdunia
గురువారం, 26 మార్చి 2020 (10:29 IST)
కరోనా వైరస్ నేపథ్యంలో భారత్‌కు సాయం చేసేందుకు డ్రాగన్ కంట్రీ ముందుకొచ్చింది. చైనాలో దాదాపు 81 వేల మంది వైరస్ బారిన పడగా, 3,200 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. ఈ నెల ఆరంభంలో చైనాకు ఇండియా నుంచి 15 టన్నుల వైద్య పరికరాలు వెళ్లాయి. మాస్క్‌లు, గ్లవ్స్, అత్యవసర ఔషధాలను భారత్ పంపింది. ఇదే విషయాన్ని గుర్తు చేసిన జీ రాంగ్, భారత ప్రజలు చైనాకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 
 
సాధ్యమైనంత త్వరగా భారతీయులు ఈ వైరస్‌పై విజయం సాధిస్తారన్న నమ్మకం తమకుందని చెప్పారు. ఇంకా భారత్‌కు సాయం చేసేందుకు తాము సిద్ధమని ప్రకటించింది. భారత్‌కు ఎలాంటి అవసరం వచ్చినా సాయం చేస్తామని తెలిపారు.
 
మరోవైపు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇకపై సీజనల్ వ్యాధిగా మారే అవకాశాలు అధికంగా ఉన్నాయని అమెరికాకు చెందిన ఓ ప్రముఖ శాస్త్రవేత్త అభిప్రాయపడుతున్నారు. అలా జరిగితే నష్టం అధికంగా ఉంటుందని, వెంటనే వ్యాక్సిన్‌తో పాటు సమర్థవంతంమైన చికిత్స విధానాలను కనుగొనాలని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments