Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరితెగించిన పాక్.. చైనాకు గిల్గిత్ భూముల్ని అమ్మేస్తుంది.. చైనా తక్కువేం తినలేదు..

చైనాలోని పలు కంపెనీలకు, చైనా ఆర్మీకి భూములను తెగ అమ్మేస్తున్నారంటూ గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులకు ఇష్టం లేకుండా.. ఈ భూములను పాకిస్థాన్ బరితెగించి చైనాకు కట్టబెడు

Webdunia
బుధవారం, 7 జూన్ 2017 (12:22 IST)
చైనాలోని పలు కంపెనీలకు, చైనా ఆర్మీకి భూములను తెగ అమ్మేస్తున్నారంటూ గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులకు ఇష్టం లేకుండా.. ఈ భూములను పాకిస్థాన్ బరితెగించి చైనాకు కట్టబెడుతోందని స్థానికులు ఫైర్ అవుతున్నారు. పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ పేరిట ఈ భూముల విక్రయాలు జరుగుతున్నాయని జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ ఆర్మీ జనరల్స్ స్థానికుల భూమిని బలవంతంగా ఆక్రమిస్తున్నారట. భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నవారిని చంపేయడం, లేదా ఎలాంటి విచారణ లేకుండానే శిక్షించడం చేస్తున్నారట. 
 
70ఏళ్ల క్రితం భారత్ నుంచి దొంగచాటుగా ఆక్రమించుకున్న గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతాన్ని పాకిస్థాన్ చైనాకు విక్రయిస్తోంది. ఇప్పటిలే వేలాది మంది గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రజలు తమ భూములను కోల్పోయారు. ఈ ప్రాంతంలో చైనా, పాక్ సైన్యాలు ఉండేలా పెద్ద కంటోన్మెంటులు ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా జరుగుతుందని  గిల్గిత్-బాల్టిస్థాన్ థింకర్స్ ఫోరం ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు.
 
మరోవైపు చైనా తన భవిష్యత్ సైనిక స్థావరాలను పాకిస్థాన్‌లో నిర్మించనుందని, దీని వల్ల దక్షిణాసియాలో తీవ్ర అనిశ్చితి తలెత్తే ప్రమాదముందని యూఎస్ డిఫెన్స్ వర్గాలు కీలక నివేదికను విడుదల చేశాయి. ఆఫ్రికా దేశమైన డిజిబౌతీలో ఇప్పటికే సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న చైనా, ఇప్పుడు పాక్ వైపు అడుగులు వేస్తోందని పెంటగాన్ తయారు చేసిన 97 పేజీల వార్షిక నివేదికలో అధికారులు అంచనా వేశారు.
 
పలు ప్రాంతాల్లో అదనపు  సైనిక స్థావరాల కోసం ఆరాటపడుతున్న చైనా ప్రస్తుతం పాకిస్థాన్‌ను తెగ వాడేసుకుంటోంది. ఇప్పటికే చైనా ఆయుధాలకు దిగుమతిదారుగా ఉన్న పాక్, చైనా సైనిక స్థావరాన్ని తమ దేశంలో ఏర్పాటు చేసుకోనిచ్చేందుకు పెద్దగా అభ్యంతరాలు పెట్టకపోవచ్చని పెంటగాన్ అభిప్రాయపడింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments