Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా-క్యూబా కొత్త వ్యాక్సిన్‌

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (12:37 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టేందుకు సమర్థవంత మైన టీకాను తయారు చేసే పనిలో చైనా-క్యూబా నిమగమయ్యాయి. ఈ రెండు సోషలిస్టు దేశాలు కలసి సంయుక్తంగా చేపట్టిన ఈ టీకా అభివృద్ది కార్యక్రమం త్వరలోనే ఒక కొలిక్కి రానుంది.

చైనా విడిగా ఇప్పటికే సినో వాక్‌తో సహా నాలుగు రకాల వ్యాక్సిన్లను తయారు చేసి వివిధ దేశాలకు సరఫరా చేసింది. క్యూబా కూడా దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో'సెబరోనా-02' అనే టీకాను రూపొందించింది, మూడో దశ పరీక్షలను కూడా పూర్తి చేసుకుని, తర్వలోనే అది ప్రజలకు అందుబాటులోకి రావడానికి సిద్ధంగా ఉంది.

అయితే, కరోనా వైరస్‌ తన రూపాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటుండడంతో కోవిడ్‌ వేరియంట్లు వంటివి విజృంభిస్తున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని వైరస్‌ ఎన్ని అవతారాలెత్తినా, దానిని సమర్థవతంగా అరికట్టేలా చైనా- క్యూబా కనిపెట్టే కొత్త వ్యాక్సిన్‌ వుండబోతుందని సిన్హువా వార్తా సంస్థ తెలిపింది.

ఇరు దేశాల పరిశోధనల కోసం హునాన్‌ ప్రావిన్స్‌లో గతేడాది ఏర్పాటు చేసిన పరిశోధనా కేంద్రంలో చైనా, క్యూబా శాస్త్రవేత్తలు వ్యాక్సిన్‌ను అభివృద్ధిపరుస్తున్నారని పేర్కొంది.

సెంటర్‌ ఫర్‌ జెనిటిక్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ బయో టెక్నాలజీ (సిఐజిబి)లో బయో మెడికల్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ అయిన గెరార్డో గిలెన్‌ మీడియాతో మాట్లాడుతూ, చైనా నుండి వచ్చిన అభ్యర్థన మేరకు ఈ ప్రాజెక్టును చేపట్టామన్నారు. క్యూబా సైన్స్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అనుమతి కూడా లభించిందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments