Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిరియాలో మారణహోమం.. రసాయనిక దాడి.. 100 మంది చిన్నారుల మృత్యువాత

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల కేంద్రంగా ఉన్న సిరియాలో మారణహోమం సాగుతోంది. రెబెల్స్ ప్రాబల్యం అధికంగా ఉన్న ఇడ్లిబ్ నగరంలో మంగళవారం రసాయన దాడి జరిగింది. ఈ దాడిలో వందలాది మంది చిన్నారులు మృత్యువాతపడ్డారు.

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2017 (09:12 IST)
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల కేంద్రంగా ఉన్న సిరియాలో మారణహోమం సాగుతోంది. రెబెల్స్ ప్రాబల్యం అధికంగా ఉన్న ఇడ్లిబ్ నగరంలో మంగళవారం రసాయన దాడి జరిగింది. ఈ దాడిలో వందలాది మంది చిన్నారులు మృత్యువాతపడ్డారు. మరో 400 మంది శ్వాసకోస ఇబ్బందులతో బాధపడుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సిరియా మెడికల్ రిలీఫ్ గ్రూప్ పేర్కొంది.
 
రసాయన దాడి తర్వాత చిన్నారులు నేలపైపడి గిలగిలా కొట్టుకుంటున్న దృశ్యాలను మీడియా ప్రసారం చేయడంతో ప్రపంచ దేశాలు సైతం ఉలిక్కిపడ్డాయి. ఈ చర్యను అంతర్జాతీయ సమాజం తీవ్రంగా తప్పుబట్టింది. ఉగ్రవాదులను అణచివేసే పద్ధతి ఇది కాదంటూ మండిపడ్డాయి. 
 
దీంతో స్పందించిన సిరియా రసాయన దాడి వార్త అవాస్తవమని, తాము రసాయన ఆయుధాలను ఉపయోగించలేదని, భవిష్యత్తులోనూ వాటిని ఉపయోగించే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. 
 
మరోవైపు సిరియా సైన్యమే ఈ దాడికి పాల్పడిందని బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న సిరియా మానవ హక్కుల సంఘం ఆరోపించింది. దాడిలో పలువురు చిన్నారులు సహా కనీసం వందమంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటాను : బాలకృష్ణ

వినోదాన్ని అందించడానికి ఇలానే శ్రమిస్తాను : పద్మభూషణ్ పురస్కారంపై అజిత్ పోస్ట్

నటనతో దశాబ్దంపాటు తెలుగు వారిని ఆలరించారు శోభన!

రీల్ హీరోనే కాదు.. నిజ జీవితంలోనూ రియల్ హీరో!!

జోరు తగ్గని సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్లు : రూ.300 కోట్ల దిశగా పరుగులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

పద్మ పురస్కార గ్రహితలు బాలకృష్ణ, నాగేశ్వరరెడ్డిలకు నాట్స్ అభినందనలు

అల్లం నీటిని తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

తర్వాతి కథనం
Show comments