ఆస్ట్రేలియాలో మిస్టరీ వస్తువు! దేవుడా.. అది చంద్రయాన్-3కి..?

Webdunia
మంగళవారం, 18 జులై 2023 (19:21 IST)
Chandrayan 3
ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ పశ్చిమ ఆస్ట్రేలియాలోని జురియన్ బే సమీపంలోని బీచ్‌లో కనుగొనబడిన ఒక వస్తువును పరిశీలిస్తోంది. ఇది భారతదేశ చంద్రయాన్-3 మిషన్‌కు చెందినది కావచ్చు అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం మిడ్ వెస్ట్ కోస్ట్‌లోని గ్రీన్ హెడ్ టౌన్ సమీపంలో ఈ వస్తువు నీటిలో తేలియాడుతూ కనిపించింది. ఆస్ట్రేలియా తీరంలో అంతుచిక్కని వస్తువు కనిపించడం కలకలం రేపింది. 
 
పశ్చిమ ఆస్ట్రేలియాలోని గ్రీన్ హెడ్ పట్టణం తీరంలో ఇది కనిపించింది. డ్రమ్‌ ఆకారంలో ఉన్న ఈ వస్తువు రాగితో చేసినదేమిటో అర్థంకాకపోవడంతో స్థానికులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. 
 
ఇప్పుడు అది రాకెట్ నుంచి విడిపోయిన శకలమై ఉండొచ్చనే చర్చ నడుస్తోంది. ఈ వస్తువుకు దూరంగా ఉండాలని స్థానిక అధికారులు స్థానికులను హెచ్చరించారు. ఈ వస్తువు ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చింది? ఈ వస్తువు గురించి తెలుసుకోవడానికి ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ కూడా రంగంలోకి దిగింది. 
 
ఇది విదేశీ అంతరిక్ష ప్రయోగానికి సంబంధించినదని అంచనా. ఇందుకు సంబంధించి పలు దేశాలతో ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ సంప్రదింపులు జరుపుతున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడైంది. కాగా, ఈ వస్తువు భారత్‌కు చెందిన పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌కు సంబంధించినదని అంతరిక్ష నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

హైదరాబాద్ సీపీ సజ్జనార్‌పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments