Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రుడిపై భారీ గుహను గుర్తించాం.. ఇటలీ సైంటిస్టులు

సెల్వి
మంగళవారం, 16 జులై 2024 (15:49 IST)
Moon
చంద్రుడిపై ఓ భారీ గుహను గుర్తించినట్లు ఇటలీ సైంటిస్టులు చెప్పారు. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కాలుమోపిన ప్రాంతానికి దగ్గర్లోనే ఈ భారీ గుహ ఉందని చెప్పారు. చంద్రుడిపై పర్వతాలు, లోయలు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించిన అంతరిక్ష పరిశోధకులు తాజాగా గుహ వున్నట్లు గుర్తించినట్లు ఇటలీ సైంటిస్టులు తెలిపారు. సోలార్ రేడియేషన్, కాస్మిక్ కిరణాల నుంచి ఆస్ట్రోనాట్లకు ఇవి రక్షణ కల్పిస్తాయని వివరించారు.
 
అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ 55 ఏళ్ల క్రితం చంద్రుడిపై కాలుమోపిన సంగతి తెలిసిందే. ఆర్మ్ స్ట్రాంగ్ దిగిన చోటు నుంచి దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఈ బిలాన్ని గుర్తించామని ఇటలీ సైంటిస్టుల బృందం నిర్ధారించింది. 
 
అగ్నిపర్వతం వెదజల్లిన లావా కారణంగా ఈ బిలం ఏర్పడి ఉంటుందని సైంటిస్టులు చెప్పారు. ఈ గుహ వెడల్పు కనీసం 40 మీటర్లు ఉంటుందని, పొడవు మరింత ఎక్కువగా ఉండొచ్చని పేర్కొన్నారు.
 
భూమిపై ఉన్నట్లుగానే చంద్రుడిపైనా భారీ గుహలు ఉండొచ్చని అంతరిక్ష పరిశోధకులు భావిస్తున్నారు. దాదాపు 50 ఏళ్లుగా కొనసాగిన ఈ మిస్టరీని తమ బృందం ఛేదించిందని ఇటలీ పరిశోధకులు వివరించారు. ప్రస్తుతానికి ఒక గుహను మాత్రమే కనుగొన్నప్పటికీ చంద్రుడిపై పదులు, వందల సంఖ్యలో గుహలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments