Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటి పైకప్పుపై ఎక్కి కూర్చున్న ఎస్‌యూవీ కారు.. ఎలాగో వీడియో చూడండి..

కొన్ని రోడ్డు ప్రమాదాలు ఘోరంగా ఉంటాయి. మరికొన్ని నవ్వు తెప్పిస్తాయి. కానీ చైనాలో చోటుచేసుకున్న వింత ప్రమాదం అందరికీ షాకివ్వడంతో పాటు నవ్వించింది. చైనా రోడ్డుపై వేగంగా దూసుకెళ్తున్న ఓ కారు.. ఉన్నట్టుండ

Webdunia
బుధవారం, 15 మార్చి 2017 (15:11 IST)
కొన్ని రోడ్డు ప్రమాదాలు ఘోరంగా ఉంటాయి. మరికొన్ని నవ్వు తెప్పిస్తాయి. కానీ చైనాలో చోటుచేసుకున్న వింత ప్రమాదం అందరికీ షాకివ్వడంతో పాటు నవ్వించింది. చైనా రోడ్డుపై వేగంగా దూసుకెళ్తున్న ఓ కారు.. ఉన్నట్టుండి అదుపు తప్పి.. రోడ్డుకు సమీపంలోని ఇంటి పై కప్పుపై ఎక్కి కూర్చుంది. ఈ రోడ్డు ప్రమాదాన్ని చూసినవారంతా షాక్ తిన్నారు.
 
కారు వేగంగా వెళ్తుండగా.. త్రిచక్ర వాహనం అడ్డుగా వచ్చింది. ఆ వాహనాన్ని ఢీ కొట్టకుండా ఉండేందుకు కారు డ్రైవర్ స్టేరింగ్ తిప్పేశాడు. అంతే కారు అదుపు తప్పింది.. అతివేగంతో పక్కనే ఉన్న ఇంటి పైకప్పుపై కారు ఎక్కి  కూర్చుంది. కారు డ్రైవర్‌ పెను ప్రమాదం నుంచి బయటపడటంతో అందరూ నవ్వుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
పశ్చిమ చైనాలోని తైజూ సిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటిపై కప్పుపై చేరిన ఎస్‌యూవీ కారును క్రేన్ ద్వారా కిందికి దించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ వీడియో మీ కోసం..
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments