టర్కీలో 13 మంది సైనికుల మృతి.. 48 మందికి గాయాలు...

టర్కీ మరోమారు బాంబు పేలుళ్ళతో ఉలిక్కిపడింది. టర్కీ సైనిక సిబ్బందిని తీసుకువెళ్తున్న బస్సును పేలుడు పదార్థాలు ఉన్న కారు ఢీ కొట్టడంతో పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 13 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా, 48

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2016 (14:47 IST)
టర్కీ మరోమారు బాంబు పేలుళ్ళతో ఉలిక్కిపడింది. టర్కీ సైనిక సిబ్బందిని తీసుకువెళ్తున్న బస్సును పేలుడు పదార్థాలు ఉన్న కారు ఢీ కొట్టడంతో పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 13 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా, 48 మంది గాయపడినట్లు టర్కీ సైన్యం వెల్లడించింది. క్యాసేరిలోని ఎరసైయెస్‌ యూనివర్సిటీ సమీపంలో ఈ ఘటన జరిగింది. 
 
ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్సులు క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పేలుడు ధాటికి బస్సు పూర్తిగా ధ్వంసమైంది. సైనికులను తీసుకెళ్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకొనే ఈ కారు బాంబు దాడికి పాల్పడినట్లు టర్కీ ఉప ప్రధాని వెసి క్యానక్‌ తెలిపారు. కాగా, గతవారం టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో కుర్దిష్‌ మిలిటెంట్లు జరిపిన దాడిలో 44 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments