తమ భార్యలకు విడాకులు ఇచ్చేవారిలో దేశాధిపతులు, ప్రధానమంత్రులు సైతం చేరిపోతున్నారు. తాజాగా కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తన భార్యకు విడాకులు ఇచ్చారు. ఆయనకు సోఫీ అనే మహిళతో 18 యేళ్ళ క్రితం వివాహమైంది. ఇపుడు వీరి దాంపత్య జీవితానికి స్వస్తి చెప్పారు. ఈ విషయాన్ని వారు స్వయంగా వెల్లడించారు. ఇందుకుసంబంధించిన లీగల్ డాక్యుమెంట్లపై వారిద్దరూ సంతకాలు చేసినట్టు ట్రూడో కార్యాలయం అధికారికంగా బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.
ట్రూడో (51) 2005లో 48 యేళ్ల సోఫీ(48)ని వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం జస్టిస్, సోఫీతమ పిల్లలను ఓ భద్రమైన ప్రేమపూరిత వాతావరణంలో పెంచడంపైనే దృష్టిపెట్టారని ట్రూడో కార్యాలయం తన ప్రకటనలో తెలిపింది. వారంతా ఎప్పటికీ ఓ కుటుంబమేనని అందులో వెల్లడించింది.