Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్విట్జర్లాండ్‌లో బురఖా ధరించడంపై నిషేదమా? రూ.7,800 నుంచి రూ.7.85 లక్షల వరకు ఫైన్ అట!

ప్రపంచ ప్రర్యాటక దేశమైన స్విట్జర్లాండ్‌లో బురఖా ధరించడంపై ప్రభుత్వం నిషేదం విధించింది. స్విట్జర్లాండ్‌ ఆగ్నేయ రాష్ట్రమైన టిసినోలో బురఖాలపై కొత్త చట్టం అమలు చేయబడింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారికి

Webdunia
శనివారం, 9 జులై 2016 (10:21 IST)
ప్రపంచ ప్రర్యాటక దేశమైన స్విట్జర్లాండ్‌లో బురఖా ధరించడంపై ప్రభుత్వం నిషేదం విధించింది. స్విట్జర్లాండ్‌ ఆగ్నేయ రాష్ట్రమైన టిసినోలో బురఖాలపై కొత్త చట్టం అమలు చేయబడింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానా విధించాలని కూడా ఆదేశించింది. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే... 7,800 రూపాయల నుంచి దాదాపు 7.85 లక్షల రూపాయల వరకు జరిమానా విధించనున్నారు. 
 
హోటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలు, ప్రభుత్వ భవనాల్లో ముఖం కనిపించకుండా బురఖా ధరించకూడదని స్థానికులను హెచ్చరించింది. ఈ కొత్త చట్టం జూలై ఒకటవ తేదీ నుంచే అమల్లోకి వచ్చిందని స్విట్జర్లాండ్‌ ఆగ్నేయ రాష్ట్రమైన టిసినో ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ చట్టం టిసినో, లుగానో, బెల్లింజోన, మెండ్రిసియో, లొకార్నో, మగదినో ప్రాంతాల్లో అమల్లోకి వచ్చాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని సౌదీ అరేబియా దౌత్య కార్యాలయం తమ దేశ పర్యాటకులకు ముందుగా హెచ్చరికలు జారీ చేసింది.  
 
ఇలాంటి చట్టాన్ని రాష్ట్రం రూపొందించడం తప్పుకాదని స్విట్జర్లాండ్ పార్లమెంటు దీనిని సమర్థించింది. విమానాశ్రయాల్లో, కస్టమ్స్ కార్యాలయాల్లో, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో బురఖా నిషేధం గురించి ప్రయాణికులను ముందుగానే హెచ్చరిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments