Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా అంచనా తప్పైంది.. బ్రిటన్ నాయకుడిగా ఉండలేను.. 3 నెలల్లో కొత్త ప్రధాని: డేవిడ్ కామెరూన్

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2016 (14:52 IST)
యూరోపియన్ యూనియన్‌తో కలిసి ఉండాలన్న తన భావన తప్పు అని బ్రెగ్జిట్ పోల్ ద్వారా వెల్లడైందని, అందువల్ల నాకు వారసుడు కావాలని బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ అన్నారు. పైగా, బ్రెగ్జిట్ పోల్ ద్వారా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని చెప్పారు. అదేసమయంలో దేశానికి కొత్త నాయకత్వం అవసరమని అభిప్రాయపడిన కామెరాన్‌ అక్టోబరులో బ్రిటన్‌కు కొత్త ప్రధానమంత్రి వస్తారని పేర్కొన్నారు.
 
బ్రెగ్జిట్‌ ఫలితాలు వెలువడిన కొద్దిసేపటికి బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌ ఆయన భార్య సమంతాతో కలిసి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లు ప్రకటించారు. ‘ప్రస్తుతం యూరోప్‌లో బ్రిటన్‌ పాత్రపై చర్చలు జరిపేందుకు బలమైన విశ్వసనీయమైన నాయకత్వం అవసరం. నేను బ్రిటన్‌ ప్రధానిని అయినందుకు గర్విస్తున్నాను.. నేను ప్రధాని పదవి నుంచి వైదొలగుతున్నాను.. వచ్చే మూడునెలల పాటు ఈ పదవిలో కొనసాగుతా. అక్టోబర్‌లో జరిగే కన్జర్వేటివ్‌ పార్టీ సమావేశంలో కొత్త ప్రధానిని ఎన్నుకుంటారు. నా అభిప్రాయానికి భిన్నంగా బ్రిటన్‌ ప్రజలు తీర్పునిచ్చారు.. ఇప్పుడు ఇంకా నేను బ్రిటన్‌ నాయకుడిగా ఉండటం సరికాదు’ అని కామెరాన్‌ పేర్కొన్నారు.
 
బ్రెగ్జిట్‌పై జరిగిన రిఫరెండంలో యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ విడిపోవడంవైపే బ్రిటిష్‌ ప్రజలు మొగ్గుచూపారు. రిఫరెండానికి ముందు బ్రెగ్జిట్‌కి వ్యతిరేకంగా ఓటు వేయాలని కామెరాన్‌ ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రయాణించే విమానం నుంచి దూకాలని ప్రయత్నించకండి, మళ్లీ ఎక్కడం అసాధ్యం.. ఈయూ నుంచి ఒక్కసారి వైదొలగితే అపార నష్టం వాటిల్లుతుందని కామెరాన్‌ ప్రజలను హెచ్చరించారు. కానీ ప్రజలు ఆయన పిలుపునకు వ్యతిరేకంగా ఈయూ నుంచి విడిపోయేందుకే అనుకూలంగా తీర్పునిచ్చారు. 
 
అందువల్ల మూడు నెలల తర్వాత (ఈ ఏడాది అక్టోబర్)లో ప్రధాని పదవి నుంచి దిగిపోతున్నట్లు ఆయన ప్రకటించారు. యూరోపియన్ యూనియన్‌లో బ్రిటన్‌ను కొనసాగించేందుకు తన శాయశక్తులా యత్నించానని చెప్పిన ఆయన... అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయానన్నారు. ఈ నేపథ్యంలో దేశాన్ని నడిపించే బాధ్యతలకు స్వస్తి చెప్పేందుకే నిర్ణయించుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజాభిప్రాయ సేకరణలో వ్యతిరేక ఫలితాలు సాధించిన తనకు అధికారంలో కొనసాగే అర్హత లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments