Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీకి అరుదైన గౌరవం: నేపాల్ ప్రధాని ప్రొటోకాల్ ఉల్లంఘన!

Webdunia
మంగళవారం, 29 జులై 2014 (17:58 IST)
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అరుదైన గౌరవం దక్కనుంది. నేపాల్ పర్యటనకు వెళ్లనున్న నరేంద్ర మోడీని ఆహ్వానించేందుకు నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాల సిద్ధమవుతున్నారు. నేపాల్ ప్రధాన మంత్రి సుశీల్ కోయిరాల ప్రొటోకాల్ నియమాలను సైతం పక్కనబెట్టి మోడీకి స్వయంగా స్వాగతం పలకనున్నారు.
 
రెండు రోజుల పర్యటన కోసం ఆగస్టు 3న నేపాల్కు వెళ్లనున్న మోడీకి త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏడుగురు మంత్రులు, సీనియర్ అధికారులు, పారిశ్రామిక వేత్తలతో కూడిన 101 మంది ప్రతినిధుల బృందం మోడీకి స్వాగతం పలకనున్నారు. 
 
ప్రధాని సుశీల్ కోయిరాల కూడా విమానాశ్రయానికి రానున్నారు. దీన్ని బట్టి మోడీ పర్యటనకు నేపాల్ ఎంతటి ప్రాధాన్యం ఇస్తుందో అర్థం చేసుకోవచ్చని కోయిరాల సలహాదారు దినేశ్ భట్టారాయ్ పేర్కొన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments