Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేయసి శరీరంలో దెయ్యాలు ఉన్నాయంటూ 16 సార్లు కత్తితో పొడిచిన ప్రియుడు!

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2015 (14:50 IST)
ప్రాశ్చాత్యదేశాల్లో కూడా మూఢనమ్మకాలు ఏమాత్రం తక్కువలేవని తాజా సంఘటన నిరూపించింది. ప్రముఖ హాలీవుడ్ నటుడు మోర్గాన్ ఫ్రీమన్ మనుమరాలు హైన్స్ (33) ఈ మూఢ నమ్మకానికి బలైంది. ఈమెను ప్రియుడే 16 సార్లు కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈమె శరీరంలో దెయ్యాలు ఉన్నాయనీ వాటిని తరిమికొట్టేందుకు ఆ పని చేసినట్టు ప్రియుడు లమెన్ డావెన్‌పోర్ట్ (30) చెపుతున్నాడు. 
 
తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే... హైన్స్ శరీరంలో చాలా దయ్యాలున్నాయని, వాటిని తరిమేశక్తి జీసెస్ క్రైస్ట్‌కే ఉందని హైన్స్ ప్రియుడు డావెన్‌పోర్ట్ గట్టిగా నమ్మాడు. అందుకే ఆదివారం ఉదయం నడివీధిలోకి తీసుకొచ్చి భయంకరంగా అరుస్తూ కిరాతకంగా కత్తితో పొడుస్తూ చంపేశాడు. ఇలా దాదాపు 16 సార్లు ఆమెను పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.
 
‘ఆమె శరీరం రోడ్డుపై పడి ఉంది. అతను మోకాళ్ల మీద ఆమె మీద కూర్చుని ఉన్నాడు. ‘బయటికి రండి. బయటికి రండి’ అంటూ గట్టిగా అరుస్తూ ఆమెను కత్తితో చాలా సార్లు పొడిచాడు. చూడడానికి ఆ దృశ్యం భూతవైద్యం చేస్తున్నట్టుగా ఉంద’ని ప్రత్యక్ష సాక్షి ఒకరు వివరించారు. కాగా, హైనస్ ‘ఫైవ్ ఫ్లైట్స్ అప్’ అనే హాలీవుడ్ సినిమాలో నటించగా, ఈ చిత్రం గత మే నెలలో విడుదలైంది. మరోవైపు.. 33 యేళ్ళ హైన్స్ కొంతకాలంగా ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తోంది. కాగా, హైన్స్ మరణం తననెంతో కలచి వేసిందని మోర్గాన్ విచారం వ్యక్తంచేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments