Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘనిస్థాన్‌లోని మసీదులో భారీ పేలుడు: వందమంది మృతి

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (19:03 IST)
ఆప్ఘనిస్థాన్‌లోని మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో వందమంది ప్రాణాలు కోల్పోయారు. భారీ సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. షియా ముస్లింలు మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా ఈ ఘటన జరిగిందని తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు. దీనిపై తాలిబన్ల ప్రత్యేక బృందం ఘటనస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తుందని తెలిపారు. 
 
కుందుజ్‌లోని ఆసుపత్రులకు తీసుకువస్తున్న క్షతగాత్రుల సంఖ్య అంతకంతకు పెరుగుతోందని ఓ వైద్యుడు తెలిపారు. ఇటీవల షియా ముస్లిం వర్గానికి ఐసిస్-కె ఉగ్రవాద సంస్థ నుంచి పలు హెచ్చరికలు వచ్చినట్టు తెలుస్తోంది. దాడి జ‌రిగిన స‌మ‌యంలో మ‌సీదులో వంద‌ల మంది ముస్లింలు ప్రార్ధ‌న‌లు చేస్తున్నారు. దాడి ఘ‌ట‌న‌లో క్ష‌త‌గాత్రుల‌తో కుందుజ్ సెంట్ర‌ల్ ఆస్ప‌త్రి కిక్కిరిసిపోయింది. 
 
ఈ ఘ‌ట‌న‌లో త‌మ ఆస్ప‌త్రికి ఇప్ప‌టికి 35 మృత‌దేహాలు తీసుకువ‌చ్చార‌ని, 50 మంది గాయ‌ప‌డిన వారికి చికిత్స అందిస్తున్నామ‌ని వైద్యులు తెలిపారు. ఇక ఇత‌ర ఆస్పత్రుల్లోనూ బాధితులు చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments