Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు మరో ట్రంప్ దెబ్బ.. కాల్‌సెంటర్లు ఇక విదేశాలకు తరలించేది లేదు.. కొత్త బిల్లు ప్రవేశం

అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ సర్కారు మరో బిల్లుతో భారత్‌పై గండికొట్టింది. అమెరికా ఉద్యోగాలను విదేశాలకు తరలించకుండా కంపెనీలను అడ్డుకోవడం, వాటిని అమెరికాలోనే ఏర్పాటు చేసేలా ప్రోత్సహించడం ఈ బిల్లు ఉద్దేశం

Webdunia
శనివారం, 4 మార్చి 2017 (11:20 IST)
అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ సర్కారు మరో బిల్లుతో భారత్‌పై గండికొట్టింది. అమెరికా ఉద్యోగాలను విదేశాలకు తరలించకుండా కంపెనీలను అడ్డుకోవడం, వాటిని అమెరికాలోనే ఏర్పాటు చేసేలా ప్రోత్సహించడం ఈ బిల్లు ఉద్దేశం. ‘ది యూఎస్‌ కాల్‌ సెంటర్‌ అండ్‌ కన్సూ్యమర్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ అనే ఈ బిల్లును డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన జీన్‌ గ్రీన్‌, రిపబ్లికన్‌ పార్టీకి చెందిన డేవిడ్‌ మెక్‌ కిన్లేలు ప్రవేశపెట్టారు. ఈ బిల్లుద్వారా కాల్‌సెంటర్లను విదేశాలకు తరలించే అమెరికా కంపెనీలకు ప్రభుత్వ గ్రాంట్లు, పూచీకత్తు రుణాలను దక్కకుండా చేయవచ్చు. తద్వారా భారత్ వంటి దేశాలకు ఉద్యోగాల తరలింపును అడ్డుకునేందుకు వీలుంటుంది. 
 
ఈ బిల్లు ప్రకారం.. తమ సేవల మొత్తాన్నీ లేదా ఎక్కువ భాగాన్ని విదేశాలకు తరలించే కంపెనీలతో ఒక జాబితాను నిర్వహించి.. వాటికి ఫెడరల్ గ్రాంట్లు, పూచీకత్తు రుణాలు దక్కనట్లు చేస్తారు. కాల్ సెంటర్ ఉద్యోగాలు భారత్‌, ఫిలిప్పీన్స్‌, ఇతర దేశాలకు తరలిపోయాయి. ఇరు పార్టీల మద్దతు ఉన్న ఈ బిల్లు వల్ల కాల్‌ సెంటర్‌ ఉద్యోగాలను సంరక్షించడం సాధ్యమవుతుంది. అమెరికా వినియోగదారులకూ మేలు జరుగుతుంది. 
 
2013లో ప్రవేశపెట్టిన బిల్లు తరహాలోనే ఇది కూడా ఉంది. గ్రేటర్‌ హ్యూస్టన్‌ ప్రాంతంలోనే 54వేల కాల్‌సెంటర్‌ ఉద్యోగాలు ఉన్నాయని జీన్ గ్రీన్‌ చెప్పారు. దేశవ్యాప్తంగా 25 లక్షల ఉద్యోగాలు ఉన్నాయన్నారు. సేవా రంగంలోని మంచి ఉద్యోగాలు అమెరికన్లకు దక్కాలని.. ఇంకా వారి జీవన మనుగడకు సరిపడా వేతనాలను పొందాలని వెల్లడించారు. దురదృష్టవశాత్తు కాల్‌ సెంటర్‌ ఉద్యోగాలు భారత్‌, ఫిలిప్పీన్స్‌, ఇతర దేశాలకు తరలిపోయాయని జీన్ గ్రీన్ తెలిపారు. ఇరు పార్టీల మద్దతు ఉన్న ఈ బిల్లు వల్ల కాల్‌ సెంటర్‌ ఉద్యోగాలను సంరక్షించడం సాధ్యమవుతుందని జీన్ గ్రీన్ వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

HIT 3 Movie Review: క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ HIT మూవీ రివ్యూ రిపోర్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments