Webdunia - Bharat's app for daily news and videos

Install App

దివాళా దిశగా అమెరికా రుణ పరిమితి .. భయపెడుతున్న 'సీలింగ్‌'

Webdunia
గురువారం, 18 మే 2023 (11:56 IST)
అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక రంగం దివాళీ దిశగా పయనిస్తుంది. రుణపరిమితి దారుణంగా పెరిగిపోయింది. దీంతో ఈ నెల 19-21 తేదీల్లో జపాన్‌లోని హిరోషిమా వేదికగా జీ-7 సదస్సు జరగనుంది. ఆ తర్వాత 22 నుంచి 24 వరకు సిడ్నీలో క్వాడ్‌ సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తన పర్యటనను అర్థాంతరంగా వాయిదా వేసుకున్నారు. దేశంలో నెలకొన్న ఆర్థిక అస్థిరత కారణంగా ఆయన తన వాయిదా వేసుకోవడంతో.. క్వాడ్‌ సదస్సును రద్దు చేస్తున్నట్లు ఆసీస్‌ ప్రధాని అల్బనీస్‌ వెల్లడించారు.

'వచ్చే వారం క్వాడ్‌ సదస్సు జరగట్లేదు. ఈ వారాంతంలో జరిగే జీ-7 సదస్సులోనే క్వాడ్‌ (అమెరికా, భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌) దేశాధినేతలు భేటీ అవుతారు. అయినప్పటికీ భారత్, జపాన్‌ ప్రధానులు మోడీ, కిషిదాను మేం మా దేశానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దీని గురించి వారితో చర్చిస్తున్నాం. అయితే తమ పర్యటనపై భారత్‌, జపాన్‌ ప్రధానుల నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు' అని అల్బనీస్‌ వెల్లడించారు.

అయితే, తన ఆసీస్‌ పర్యటనను రద్దు చేసుకున్న బైడెన్‌.. అల్బనీస్‌ను అమెరికాకు రావాలని ఆహ్వానించారు. మరోవైపు, భారత ప్రధాని నరేంద్రమోదీ కూడా వచ్చే నెలలో అమెరికాలో పర్యటించనున్నారు. జూన్‌ 22న మోదీకి బైడెన్ శ్వేతసౌథంలో ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఇక, జపాన్‌లో జరిగే జీ-7 సదస్సుకు కూడా నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. ఆ సదస్సులో భాగంగా మోడీ, బైడెన్‌ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు.

సంబంధిత వార్తలు

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments