Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌లో భారీ వర్షాలు: 107 మందికిపైగా మృతి.. వంద మందికిపైగా గాయాలు

బంగ్లాదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వానల ధాటికి కొండ చరియలు విరిగిపడ్డాయి. మంగళవారం నాటికి 107 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువమంది భారత సరిహద్దుకు సమీపంల

Webdunia
బుధవారం, 14 జూన్ 2017 (09:35 IST)
బంగ్లాదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వానల ధాటికి కొండ చరియలు విరిగిపడ్డాయి. మంగళవారం నాటికి 107 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువమంది భారత సరిహద్దుకు సమీపంలో ఉన్న కొండప్రాంతమైన రంగమతి జిల్లాకు చెందినవారే. మృతుల్లో ఓ మేజర్‌, ఓ కెప్టెన్‌ సహా ఐదుగురు సైనిక సిబ్బంది ఉన్నారు.
 
రంగమతిని చిట్టగాంగ్‌ను కలుపుతూ ఉన్న ప్రధానరహదారిపై పేరుకున్న రాళ్లు, రప్పల తొలగింపు చర్యల్లో పాల్గొంటుండగా.. కొండ చరియలు విరిగిపడి వీరు మరణించినట్లు తెలిపారు. దాదాపు 100 మందికిపైగా గాయాలపాలయ్యారని.. మృతదేహాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సైనిక అధికారులు తెలిపారు. 
 
రుతుపవన వర్షాలతో వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో చాలా వరకు మారుమూల ప్రాంతాలకు సహాయ చర్యలు అందించడం కష్టతరంగా మారింది. మరణాల్లో ఎక్కువ శాతం కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లోనే సంభవించగా.. విద్యుదాఘాతానికి గురవడం, నీటిలో మునగడం, గోడలు కూలడం తదితర ఘటనల్లో మరికొందరు మరణించారని సైనిక అధికారులు వెల్లడించారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments