Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాలో విద్యాభ్యాసం చేయాలనివుందా.. అయితే, ఆంగ్ల భాషపై పట్టుండాల్సిందే...

Webdunia
బుధవారం, 13 డిశెంబరు 2023 (08:51 IST)
ఆస్ట్రేలియాలో విద్యాభ్యాసం చేయాలని భావించే భారతదేశంతో పాటు ఇతర దేశాలకు చెందిన విద్యార్థులు ఆ దేశ ప్రభుత్వం చేదు వార్త చెప్పింది. ఇక నుంచి తమ దేశంలో విద్యాభ్యాసం చేయాలని భావించే విద్యార్థులకు ఆంగ్ల భాషా నైపుణ్యంపై అధిక రేటింగ్ సాధిస్తేనే విద్యార్థులకు విసాలు మంజూరు చేస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ తరహా కఠిన నిర్ణయం తీసుకోవడానిక కారణం లేకపోలేదు. 
 
ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియాకు వలస రూపంలో వెళ్ళేవారి సంఖ్య క్రమంగా పెరిగిపోయింది. ముఖ్యంగా, విద్యాభ్యాసం వెళ్లే విద్యార్థులు.. తమ చదువులు పూర్తయిన తర్వాత అక్కడే ఏదో ఒక ఉపాధిని సంపాదించుకుని స్థిరపడిపోతున్నారు. దీంతో ఆస్ట్రేలియా సర్కారు పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇందులోభాగంగా, ఇకనుంచి విద్యార్థులు, తక్కువ నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు జారీ చేసే వీసాల నిబంధనలు మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది. 
 
తాజాగా మార్చిన నిబంధనల ప్రకారం... ఆస్ట్రేలియాలో చదవాలనుకునే విదేశీ విద్యార్థులు ఆంగ్ల భాషా నైపుణ్య పరీక్షల్లో అత్యధిక రేటింగ్ సాధించాల్సి ఉంటుంది. అంతేకాదు, ఆస్ట్రేలియాలో ఎక్కువకాలం ఉండేందుకు ఉపకరించే రెండో వీసా దరఖాస్తును ఇకపై మరింత క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. దరఖాస్తులో చిన్న లోపం ఉన్నా, సంబంధిత పత్రాల్లో ఏ కొంచెం తేడా ఉన్నా వీసా నిరాకరించే అవకాశం ఉంటుంది.
 
దీనిపై ఆస్ట్రేలియా ప్రభుత్వం వివరణ ఇచ్చింది. తమ నూతన వలస విధానాన్ని ఐదు అంశాల ఆధారంగా రూపొందించామని వెల్లడించింది. ఆస్ట్రేలియన్ల జీవన ప్రమాణాలను పెంపొందించడం, సుహృద్భావ పని వాతావరణం కల్పించడం, అంతర్జాతీయ సంబంధాలు బలోపేతం చేసుకోవడం వీటిలో ముఖ్యమైనవని తెలిపింది.
 
ఇప్పటికే ఓ మోస్తరు నైపుణ్యాలతో ఆస్ట్రేలియాలో నెట్టుకొస్తున్న విదేశీయులకు కూడా ఈ వీసా నిబంధనలు ఇబ్బందిగా మారనున్నాయి. కొత్త వీసాలు మంజూరు చేస్తున్న నేపథ్యంలో, ఇప్పటికే తక్కువ నైపుణ్యాలు కలిగినవారి తాత్కాలిక వీసాలు సమీక్షించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments