Webdunia - Bharat's app for daily news and videos

Install App

మతిమరుపు రోగులకు ఓ గ్రామం...

మతిమరుపు(డెమెన్షియా) రోగుల కోసం ఓ గ్రామం నిర్మితమవుతోంది. ఇందుకోసం సుమారు రూ.128 కోట్లను ఖర్చు చేయనుంది. ఈ నిధులతో సకల సదుపాయాలను కల్పించనుంది. ఈ తరహా గ్రామాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్న దేశం ఆస

Webdunia
సోమవారం, 24 జులై 2017 (09:32 IST)
మతిమరుపు(డెమెన్షియా) రోగుల కోసం ఓ గ్రామం నిర్మితమవుతోంది. ఇందుకోసం సుమారు రూ.128 కోట్లను ఖర్చు చేయనుంది. ఈ నిధులతో సకల సదుపాయాలను కల్పించనుంది. ఈ తరహా గ్రామాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్న దేశం ఆస్ట్రేలియా. ఈ డెమెన్షియా విలేజ్‌లో 90 ఇళ్లు నిర్మించనున్నారు. అలాగే 18 నెలల్లోనే ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. 
 
దక్షిణ టాస్మేనియాలోని హోల్‌బాట్‌లో నిర్మించనున్న ‘డెమెన్షియా విలేజ్’లో 15 దర్జీ ఇళ్లతోపాటు సూపర్ మార్కెట్, సినిమా, కేఫ్, బ్యూటీ సెలూన్, గార్డెన్ తదితరాలు కూడా ఉంటాయి. మతిమరుపు రోగులు పూర్తి స్వేచ్ఛగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ గ్రామాన్ని నిర్మిస్తున్నారు. గ్రామంలో నివసించే వారు సామాజిక కార్యక్రమాలు సహా అన్నింటిలోనూ పాల్గొనేలా దీనిని తీర్చిదిద్దనున్నారు.
 
కాగా, నెదర్లాండ్స్‌లో ఇప్పటికే ఇటువంటి గ్రామం ఒకటి ఉంది. 2009లో డి హోగెవెక్‌లో మతిమరుపు రోగుల కోసం ప్రత్యేకంగా ఓ గ్రామాన్ని నిర్మించింది. ఎనిమిదేళ్లుగా ఇక్కడ నివసిస్తున్న రోగుల్లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ఇటువంటి గ్రామమే ఐర్లాండ్‌లో నిర్మితమవుతోంది. ఇక్కడ కూడా కేఫ్, బ్యూటీ సెలూన్, జిమ్, గార్డెన్లు తదితర వాటిని నిర్మిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments