Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్ ఆలయంలో తొక్కిసలాట... 10 మంది మృతి

Webdunia
శనివారం, 28 మార్చి 2015 (08:37 IST)
బంగ్లాదేశ్ లోని ఓ హిందూ దేవాలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో 10 మంది భక్తులు మరణించారు. మరో 30 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో మహిళలో అధికంగా ఉన్నారు. శుక్రవారం బంగ్లాదేశ్ లాంగ్లాబాద్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
బంగ్లాదేశ్ లోని హిందువుల పవిత్ర పుణ్యస్థలం లాంగ్లాబాద్ ప్రాంతంలోని లంగల్ బంద్ దేవాలయానికి వేలాదిమంది భక్తులు  పోటెత్తారు. అయితే అక్కడ అన్ని ఏర్పాట్లు లేకపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ తొక్కిసలాటలో 10 మంది మరణించారు. మరో 30 మంది గాయపడ్డారు. రాజధాని ఢాకా సమీపంలో పాత బ్రహ్మపుత్ర  నదీతీరంలో వేలాదిమంది భక్తులు పుణ్యస్నానాలు చేసి ఆలయానికి వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 
 
చనిపోయిన వారంతా యాభైఏళ్లు పైబడినవారని తెలుస్తోంది. మృతుల్లో ఏడుగురు మహిళలున్నారు.  ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమంలో బంగ్లాదేశీయులతో పొరుగు దేశీయులైన భారతీయులు, నేపాలీయులు కూడా  పుణ్యస్నానాలు చేస్తారు. దుర్ఘటనపై బంగ్లాదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 
 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments