Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌లో కార్గో నౌక మునక.. 27మంది మృతి... నౌక అదృశ్యం.. ఏమైంది..?

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (20:30 IST)
Boat
ఒకవైపు కరోనాతో ప్రపంచ దేశాలు నానా తంటాలు పడుతుంటే.. మరోవైపు రోడ్డు ప్రమాదాలు, ప్రకృతీ వైపరీత్యాలు జనాల ప్రాణాలను హరిస్తున్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌లోని షితాలక్య నదిలో బోటు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 27మంది దుర్మరణం పాలయ్యారని అధికారులు తెలిపారు. వంద మందికి పైగా ప్రయాణికులను తీసుకెళుతున్న బోటు కార్గో నౌకను ఢీ కొన్న తర్వాత నదిలో తిరిగబడడంతో ఈ ప్రమాదం జరిగింది. 
 
ఢాకాకు 16 కిలోమీటర్ల దూరంలోని నారాయణ్‌గంజ్‌ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆదివారమే ఐదు మృతదేహాలను వెలికి తీశారు. సోమవారం మరో 22మంది మృతదేహాలను వెలికితీయడంతో మృతుల సంఖ్య 27కి పెరిగింది. 
 
భారీ క్రేన్‌ సాయంతో బోటును కూడా నదిలో నుండి వెలికి తీశారని అధికారులు తెలిపారు. ఢీ కొట్టిన తర్వాత కార్గో నౌక ఆ ప్రాంతంలో కనిపించకుండా పోయిందని పోలీసులను ఉటంకిస్తూ ఢాకా ట్రిబ్యూన్‌ పేర్కొంది. ఈ ఘటనపై దర్యాప్తుకు అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ నేతృత్వాన ఏడుగురు సభ్యులతో కమిటీ వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

కథంతా చెప్పేసిన థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో

మైఖేల్ జాక్సన్‌కు కలిసిరానిది.. థ్రిల్లర్‌ ఇచ్చిన గిఫ్ట్

నిఖిల్.. స్వయంభు కొత్త షెడ్యూల్ మారేడుమిల్లిలో ప్రారంభం

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments