Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో ఇళ్ల మధ్యలో కూలిన విమానం- ఇద్దరు మృతి

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (11:18 IST)
plane crash
అమెరికాలో ఇళ్ల మధ్యలో విమానం కూలిన ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. కాలిఫోర్నియా ప‌ట్ట‌ణంలోని శాన్‌డియాగో శివారులోని శాంటీ ప్రాంతంలో సోమ‌వారం మ‌ధ్యాహ్నం ఇళ్ల‌పై చిన్న విమానం కూలింది. ఈ ఘ‌ట‌న‌లో రెండు ఇళ్లతో పాటు ప‌లు వాహ‌నాలు ధ్వంసం కాగా.. రెండు మృత‌దేహాలను అగ్నిమాప‌క సిబ్బంది క‌నుగొన్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. మ‌రొ ఇద్ద‌రు గాయ‌ప‌డిన‌ట్లు తెలిపారు. 
 
మ‌ర‌ణించిన వారిని పైలట్, యూపీఎస్ డ్రైవర్ గా గుర్తించారు. ఫాక్స్ 5 శాన్ డియాగో ట్విన్ ఇంజిన్ సెస్నా 340 విమానం అరిజోనాలోని యుమా నుంచి బయలుదేరింది. గాల్లోకి ఎగిరిన కాసేప‌టికే ఆ విమానం శాంటీ ప్రాంతంలో కూలింది. ఆ స‌మ‌యంలో భారీగా మంట‌లు చెల‌రేగా.. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుని మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు. 
 
అయితే.. అప్ప‌టికే విమానంతో పాటు ప‌లు వాహ‌నాలు పూర్తిగా ద‌గ్థం అయ్యాయి. కాగా.. విమానం కూలిపోతున్న‌ప్పుడు చూసిన ప్ర‌జ‌లు ఇళ్లలోంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. విమానం కుప్ప‌కూలిన స‌మ‌యంలో ఆ విమానంలో ఎంత మంది ప్ర‌యాణీకులు ఉన్నారు అనే వివ‌రాలు ఇంకా తెలియాల్సి ఉంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments