Webdunia - Bharat's app for daily news and videos

Install App

దూసుకువస్తున్న హరికేన్.. 283 మంది మృతి... ఫ్లోరిడాలో ఎమర్జెన్సీ ప్రకటించిన ఒబామా

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం వైపు అత్యంత శక్తిమంతమైన మాథ్యూ హరికేన్ అత్యంత వేగంగా దూసుకొస్తోంది. దీంతో అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికే ఈ హ

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2016 (09:22 IST)
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం వైపు అత్యంత శక్తిమంతమైన మాథ్యూ హరికేన్ అత్యంత వేగంగా దూసుకొస్తోంది. దీంతో అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికే ఈ హరికేన్ సృష్టించిన విధ్వంసానికి కరేబియన్ దేశమైన హైతీలో 283 మంది దుర్మరణం పాలుకగా, వందలాది మంది నిరాశ్రయులయ్యారు. 
 
కాగా, మాథ్యూ హరికేన్ ప్రభావం కారణంగా.. హైతీలో గంటకు 230 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో అక్కడ భారీ నష్టం వాటిల్లింది. ఈ గాలుల ధాటికి చెట్లు, ఇళ్లు కూలిపోయాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ హరికేన్ దెబ్బకు హైతీలో జరగాల్సిన అధ్యక్ష ఎన్నికలను సైతం ఆదివారానికి వాయిదా వేశారు. 
 
ఇదిలావుండగా,  మాథ్యూ హరికేన్ ఫ్లోరిడా రాష్ట్రం వైపు వెళుతున్న క్రమంలో, అమెరికా ప్రభుత్వం అప్రమత్తమైంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫ్లోరిడా రాష్ట్రంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. ఫ్లోరిడాలో గంటకు 220 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం సమీపించే కొద్దీ హరికేన్ తీవ్రత పెరుగుతుందని తెలిపింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ సరసన నటించనున్న రాణి ముఖర్జీ.. నాని సమర్పణలో?

కాలేజీ రోజుల్లో హిచ్ కాక్ సినిమాలు చూసేవాడిని : మెగాస్టార్ చిరంజీవి

త్రిగుణ్, మేఘా చౌదరి జంటగా కామెడీ థ్రిల్లర్ జిగేల్ సిద్దమవుతోంది

Mirai: తేజ సజ్జా మిరాయ్ సినిమా రిలీజ్ డేట్ ఖరారు

Amani: అన్యాయాల్ని ప్రశ్నిస్తుందీ నారి సినిమా ట్రైలర్ : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

దుబాయ్-ప్రేరేపిత క్యాప్సూల్ కలెక్షన్‌ ప్రదర్శన: భారతీయ కోటూరియర్ గౌరవ్ గుప్తాతో విజిట్ దుబాయ్ భాగస్వామ్యం

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

తర్వాతి కథనం
Show comments