Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో భావ ప్రకటనా స్వేచ్ఛ హరించుకుపోతోంది : ట్రెంట్ ఫ్రాంక్స్

మా దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ హరించుకుపోతోందని అమెరికా ప్రతినిధుల సభ ప్రతినిధి ట్రెంట్ ఫ్రాంక్స్ ఆవేదన వ్యక్తంచేశారు. బెంగుళూరులో సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య, ఆపై హైదరాబాద్ దళిత రచయిత కంచ ఐలయ్

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2017 (09:34 IST)
మా దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ హరించుకుపోతోందని అమెరికా ప్రతినిధుల సభ ప్రతినిధి ట్రెంట్ ఫ్రాంక్స్ ఆవేదన వ్యక్తంచేశారు. బెంగుళూరులో సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య, ఆపై హైదరాబాద్ దళిత రచయిత కంచ ఐలయ్య ఉదంతాలను ప్రస్తావించిన, రిపబ్లికన్ ప్రతినిధి హెరాల్డ్ ట్రెంట్ ఫ్రాంక్స్... ఓ మరణం, మరో హత్య చేస్తామన్న బెదరింపులను భారత్ ఎంతమాత్రమూ పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించారు.
 
మాట్లాడే స్వేచ్ఛ నశిస్తోందని, ఇంటర్నెట్ మాధ్యమంగా తమ అభిప్రాయాన్ని చెప్పిన వారు సైతం శిక్షలకు గురవుతున్నారని ఆరిజోనా 8వ జిల్లాకు ప్రతినిధిగా ఉన్న హెరాల్డ్ ఆరోపించారు. నెల రోజుల క్రితం తన ఇంటిముందే ఓ జర్నలిస్టు దారుణంగా హత్యకు గురైతే, నిందితులను ఇప్పటివరకూ అరెస్ట్ చేయలేదని, ఏ మాత్రం భయంలేకుండా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్న ఘటనలు భారత్‌లో జరుగుతున్నాయని అన్నారు. 
 
ఈ సందర్భంగా గోవింద్ పనేసర్, ఎంఎం కాల్ బుర్గి, నరేంద్ర దబోల్కర్ తదితరుల హత్యలనూ ఆయన ప్రస్తావించారు. భారత్‌లో ఓ కులం సామాజిక పెత్తనం గురించి రాసిన ఐలయ్య అనే ప్రొఫెసర్‌ బీజేపీ మిత్రపక్షంలోని ఓ ఎంపీ బహిరంగంగా ఉరి తీస్తానని హెచ్చరించాడని ఫ్రాంక్స్ గుర్తుచేశారు. ప్రజా ప్రతినిధులే భావ స్వేచ్ఛను అడ్డుకుంటున్నారని, దీన్ని అడ్డుకునేందుకు భారత్‌పై ఎటువంటి ఒత్తిడి పెట్టాలన్న విషయమై చర్చించాల్సిన అవసరం ఉందని యూఎస్ కాంగ్రెస్‌ను ట్రెంట్ ఫ్రాంక్స్ కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments