Webdunia - Bharat's app for daily news and videos

Install App

డోనాల్డ్ ట్రంప్ 'ఆ' టైపా... ఏం పని చేశాడో.. ఈ వీడియో చూడండి... (Video)

అమెరికా అధ్యక్షుడి డోనాల్డ్ ట్రంప్ అనుచిత ప్రవర్తనతో అగ్రరాజ్యం పరువు పోతోంది. అమెరికా పౌరులు ప్రపంచ దేశాల ప్రజల ముందు తలెత్తుకుని తిరగలేని పరిస్థితి ఏర్పడుతోంది. క్రైస్తవ సోదరుల మతపెద్ద పోప్ ఫ్రాన్సి

Webdunia
శుక్రవారం, 26 మే 2017 (15:10 IST)
అమెరికా అధ్యక్షుడి డోనాల్డ్ ట్రంప్ అనుచిత ప్రవర్తనతో అగ్రరాజ్యం పరువు పోతోంది. అమెరికా పౌరులు ప్రపంచ దేశాల ప్రజల ముందు తలెత్తుకుని తిరగలేని పరిస్థితి ఏర్పడుతోంది. క్రైస్తవ సోదరుల మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్‌తో ట్రంప్ ప్రవర్తించిన తీరుపై కేథలిక్ సోదరులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. బ్రస్సెల్స్‌లో నాటో దేశాధినేతల సదస్సు జరుగుతోంది. నాటో ప్రధాన కార్యాలయంలో మాంటెనెగ్రో దేశ ప్రధాని డస్కో మార్కోవిక్‌‍ను పక్కకి తోసేసి దర్పం ప్రదర్శించిన ట్రంప్‌ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
ఇంతలో మరోసారి వివాదాస్పదంగా ప్రవర్తించారు. పోప్ ఫ్రాన్సిస్‌ను డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తన కుటుంబంతో సహా కలిసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పోప్ పక్కన నిలబడి ఫోటోలకు పోజులిచ్చిన ట్రంప్... ఆ సమయంలో పోప్ ఫ్రాన్సిస్ చేతిని... చిన్న పిల్లల్లా మెల్లిగా గోకి ఆయన చేతిని పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోప్ ఫ్రాన్సిస్ ఆయన చేతిని విసిరికొట్టారు. ఇది మీడియా కంటపడటంతో వివాదం రేగుతోంది. అగ్రదేశాధినేత అయివుండి హుందాగా నడుచుకోవాల్సిన ట్రంప్... సంస్కార హీనంగా ప్రవర్తించడంపై పెద్ద చర్చ నడుస్తోంది. ముఖ్యంగా పోప్ ఫ్రాన్సిస్‌తో అనుచిత ప్రవర్తన వెలుగులోకి రావడంతో క్యాథలిక్కుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments