Webdunia - Bharat's app for daily news and videos

Install App

కువైట్‌లో ఉద్యోగం.. గదిలో నిర్భంధం.. ఆంధ్రా మహిళా వీడియో విజ్ఞప్తి

సెల్వి
శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (17:05 IST)
Andhra Woman
కువైట్‌లో ఉద్యోగాల కోసం వెళ్తున్న వారికి కొన్ని చోట్ల కలిసివచ్చినా.. మరికొన్ని చోట్ల వారికి ఇక్కట్లు తప్పలేదు. మొన్నటికి మొన్న ఏపీకి చెందిన ఓ వ్యక్తి దుబాయ్‌లో ఒంటెల కాపరిగా ఇక్కట్లు పడుతున్నానంటూ వీడియో రిలీజ్ చేశాడు. 
 
ఈ వీడియో ఆధారంగా ఏపీ సర్కారు అతనిని కాపాడి స్వదేశానికి తెచ్చింది. తాజాగా ఓ మహిళ కువైట్‌లో తాను చిత్రహింసలకు గురవుతున్న వీడియోను షేర్ చేసింది. య‌జ‌మాని త‌న‌ను బంధించి శారీరక, మానసిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ బాధితురాలు ఓ వీడియో ద్వారా త‌న గోడును వెళ్ల‌బోసింది. 
 
అన్నమయ్య జిల్లాకు చెందిన కవిత అనే మ‌హిళ‌ తనను చిత్రహింసల నుండి రక్షించాలని కోరుతూ ఏపీ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డికి వీడియోలో విజ్ఞప్తి చేసింది. ఇద్దరు పిల్లలు, వికలాంగుడైన భర్త కోసం తాను కువైట్ వెళ్లానని.. కానీ ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పింది. 
 
ఏజెంట్ ద్వారా ఇక్కడికి వచ్చానని.. పాస్ పోర్ట్ లాక్కుని, ఫోన్ బ్లాక్ చేశారని వాపోయింది. క‌విత‌ యజమాని ఆఫీస్‌లో గృహనిర్బంధంలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆమె విజ్ఞప్తికి స్పందించిన మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి వెంట‌నే రాష్ట్ర ఎన్నారై సాధికారత-సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు లేఖ రాశారు. కవితను సురక్షితంగా స్వ‌దేశానికి తిరిగి వచ్చేలా జోక్యం చేసుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

ANR: మళ్ళీ తెరమీద 68 సంవత్సరాల మాయాబజార్ రీరిలీజ్

ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం లాయర్ టైటిల్ పోస్టర్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments