Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేకిన్ ఇండియాకు బూస్ట్‌లా జీఎస్టీ : మోడీపై చైనా మీడియా ప్రశంసలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై చైనా మీడియా ప్రశంసల వర్షం కురిపించింది. మోడీ చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమానికి జీఎస్టీ ఓ బూస్ట్‌లా పని చేస్తుందని చైనా మీడియా చెప్పుకొచ్చింది.

Webdunia
బుధవారం, 12 జులై 2017 (06:52 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై చైనా మీడియా ప్రశంసల వర్షం కురిపించింది. మోడీ చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమానికి జీఎస్టీ ఓ బూస్ట్‌లా పని చేస్తుందని చైనా మీడియా చెప్పుకొచ్చింది. 
 
నిజానికి భారత్, చైనా, భూటాన్ సరిహద్దుల్లో భారత్, చైనా సైన్యం నిత్యం కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య గత కొన్ని రోజులుగా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనివుంది. చైనా మీడియా కూడా భారత్‌ను తూర్పారబడుతున్నాయి. ఈ నేపథ్యంలో జీఎస్టీపై మోడీపై చైనా మీడియా ప్రశంసలు కురిపించడం గమనార్హం.
 
భారత్‌లో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు అమోఘమని కీర్తించింది. జీఎస్‌టీ చాలా గొప్పదని, ఆ ఘనత మోడీకే దక్కుతుందని కొనియాడింది. జీఎస్టీ కారణంగా లో-కాస్ట్ తయారీ రంగం నెమ్మదిగా ఇండియాపై మరలుతుందని, ప్రపంచ మార్కెట్లోని తమ ఆధిపత్యాన్ని త్వరలోనే భారత్ భర్తీ చేసే అవకాశం ఉందని అభిప్రాయపడింది. 
 
ముఖ్యంగా, మేకిన్ ఇండియాకు జీఎస్‌టీ బూస్ట్‌లా ఉపయోగపడుతుందని పేర్కొంది. జీఎస్‌టీ రాష్ట్రాల పన్నుల్లో ఉన్న తేడాలు సమసిపోయానని వివరించింది. ఫలితంగా దేశమంతా ఒకే మార్కెట్ ఏర్పడుతుందని, దీనివల్ల దేశానికి మంచే జరుగుతుందని వ్యాఖ్యానించింది. జీఎస్టీ వల్ల భారత్‌కు అంతర్జాతీయ పెట్టుబడులు వెల్లువెత్తుతాయని ‘గ్లోబల్ టైమ్స్’ తన కథనంలో వివరించింది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments