Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు దాడి చేస్తారా.. మేం చేయమంటారా.. పాకిస్థాన్‌కు అమెరికా వార్నింగ్

పాకిస్థాన్‌కు అగ్రరాజ్యం అమెరికా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. పాక్ గడ్డపై ఉన్న ఉగ్రతండాలపై దాడులు చేసి నిర్వీర్యం చేయకుంటే తామే రంగంలోకి దిగుతామని అమెరికా హెచ్చరించింది. అంటే... పాకిస్థాన్‌లోని ఉగ్రవాద

Webdunia
ఆదివారం, 23 అక్టోబరు 2016 (13:29 IST)
పాకిస్థాన్‌కు అగ్రరాజ్యం అమెరికా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. పాక్ గడ్డపై ఉన్న ఉగ్రతండాలపై దాడులు చేసి నిర్వీర్యం చేయకుంటే తామే రంగంలోకి దిగుతామని అమెరికా హెచ్చరించింది. అంటే... పాకిస్థాన్‌లోని ఉగ్రవాద మూకలపై ఒంటరిగా దాడి చేయడానికి వెనుకాడేది లేదని అమెరికా తేల్చి చెప్పింది. 
 
ముఖ్యంగా ఉగ్రవాదులను అణచివేయడంలో పాకిస్థాన్‌లోని అత్యంత బలమైన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంది. అవసరమైతే పాకిస్థాన్‌లోని ఉగ్రవాద నెట్‌వర్క్‌లపై ఒంటరిగా దాడి చేయడానికి సందేహించేది లేదని స్పష్టం చేసింది. ఉగ్రవాదానికి ఫైనాన్సింగ్‌ను నిరోధించే శాఖకు కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆదంమ్ జుబిన్ ఈ హెచ్చరిక చేశారు. 
 
పాకిస్థాన్ ప్రభుత్వంలోనూ, ముఖ్యంగా ఐఎస్ఐలోనూ బలమైన శక్తులు పాకిస్థాన్ భూభాగం నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తున్న అన్ని ఉగ్రవాద సంస్థలపై ఒకే విధమైన చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటుండటమే ప్రధాన సమస్య అన్నారు. కొన్నిఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను సహిస్తున్నారని ఆరోపించారు. ఉగ్రవాద నెట్‌వర్క్‌లను వెంటాడాలని పాకిస్థాన్‌లోని అమెరికా భాగస్వాములను కోరడం కొనసాగిస్తామన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments