Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా బీ-1 బాంబర్లు తరలింపు... ఉత్తర కొరియాపై దాడికేనా?

ఉత్తర కొరియాపై అమెరికా దాడి చేసేందుకు సిద్ధమైందా? అందుకే బీ-1 బాంబర్లను కొరియా ద్వీపానికి తరలిస్తుందా? అవుననే అంటున్నారు అంతర్జాతీయ నిపుణులు.

Webdunia
ఆదివారం, 30 జులై 2017 (14:31 IST)
ఉత్తర కొరియాపై అమెరికా దాడి చేసేందుకు సిద్ధమైందా? అందుకే బీ-1 బాంబర్లను కొరియా ద్వీపానికి తరలిస్తుందా? అవుననే అంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. 
 
అమెరికాలోని లక్ష్యాలను చేరుకోగల ఖండాతర బాలిస్టిక్ క్షిపణిని ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ విజవంతంగా ప్రయోగించడంపై సర్వత్రా ఆందోళనలు నెలకొన్న విషయంతెల్సిందే. ఈ చర్యలను అమెరికా తీవ్రంగా ఖండిస్తోంది. అంతేకాకుండా, ఉ.కొరియా పనిబడతామంటూ హెచ్చరికలు జారీచేసింది. 
 
అంతేకాకుండా, అమెరికా ఎయిర్‌పోర్స్‌కు చెందిన రెండు బీ-1 బాంబర్లను కొరియన్ ద్వీపకల్పానికి పంపించారు. ఈ బాంబర్లకు జపాన్, దక్షిణకొరియాకు చెందిన ఫైటర్ జెట్స్ తోడవ్వడంతో కొరియన్ ద్వీపకల్పంలో దళాల ప్రదర్శన నిర్వహిస్తున్నారు. దీంతో కొరియన్ ద్వీపకల్ప ప్రాంతం వేదికగా ఉద్రిక్తకరమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి.
 
ఇదిలావుండగా ఉత్తరకొరియా అణు, క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్న ప్రాంతాన్ని సంవత్సరంలోపు ధ్వంసం చేయనున్నామని మిలిటరీ అధికారులకు ట్రంప్ భరోసా ఇచ్చారని వార్తలు వెలువడుతున్నాయి. ప్రమాదకరంగా మారిన కిమ్‌పై చర్య తీసుకోకపోతే ప్రమాదం తప్పదని ఆయన భావిస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమిటీ కుర్రోళ్ళు నుంచి ‘ప్రేమ గారడీ..’ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments