Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రీన్‌కార్డు నిబంధనలను ఎత్తివేతకు అమెరికన్ కాంగ్రెస్ నేతల డిమాండ్.. భారత్‌కు మేలు

అమెరికాలో నివసించే భారతీయ ఉద్యోగులు, వ్యాపారులు శాశ్వత నివాసానికి ఉద్దేశించిన గ్రీన్‌కార్డ్‌ పొందాలంటే 12 ఏళ్ల పాటు నిరీక్షించాలంటూ వచ్చిన వార్తలపై అమెరికా నేతలు స్పందించారు. దీనికి సంబంధించి ఒక బిల్ల

Webdunia
శుక్రవారం, 14 జులై 2017 (05:51 IST)
అమెరికాలో నివసించే భారతీయ ఉద్యోగులు, వ్యాపారులు శాశ్వత నివాసానికి ఉద్దేశించిన గ్రీన్‌కార్డ్‌ పొందాలంటే 12 ఏళ్ల పాటు నిరీక్షించాలంటూ వచ్చిన వార్తలపై అమెరికా నేతలు స్పందించారు. దీనికి సంబంధించి ఒక బిల్లును కాన్సస్‌ రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్‌ కాంగ్రెస్‌ నేత కెవిన్‌ యోడర్‌ ప్రవేశపెట్టారు. ఈ సమస్యకు కారణమైన ‘దేశ ఆధారిత’ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. 
 
ఈ నిబంధన ఉండటం వల్ల భారత్, చైనా వంటి అధిక జనాభా దేశాల నుంచి వచ్చే వారికి అన్యాయం జరుగుతోందని ఆయన వివరించారు. కాంగ్రెస్‌లో ఉన్న 230 మందిలో ఇప్పటికే 100 మందికి పైగా నేతలు ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు.
 
ఈ బిల్లు ఆమోదం పొందితే ‘దేశ ఆధారిత గ్రీన్‌కార్డ్‌ జారీ’ నిబంధనని తొలగిస్తారు. ప్రస్తుతం ఈ నిబంధనల ప్రకారం స్వతంత్ర దేశం నుంచి వచ్చిన ఉద్యోగుల కుటుంబాలకు కోటా ప్రకారం గ్రీన్‌కార్డులు మం జూరు చేయాలి.  దీంతో భారత్, చైనాల నుంచి వచ్చిన వారితో సమానంగా చిన్న దేశం గ్రీన్‌లాండ్‌ నుంచి వచ్చిన ఉద్యోగులకూ గ్రీన్‌కార్డులు అందుతున్నాయి. 
 
పెద్ద దేశాల నుంచి దరఖాస్తుదారులు ఎక్కువగా ఉండటంతో ప్రతి సంవత్సరం వారి గ్రీన్‌కార్డ్‌ దరఖాస్తు కోసం ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. అలాగే ఈ బిల్లు అమలులోకి వస్తే తాత్కాలిక వీసా మీద అమెరికాలో పనిచేసే వారికి కూడా మరింత ప్రయోజనం   చేకూరనుంది.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments