పాకిస్థాన్‌కు భారత్ కొత్త పేరు పెట్టింది. ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్‌ను ''టెర్రరిస్థాన్'' అని సంబోధిస్తున్న భారత్.. జెనీవాలో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశంలో స్పెషల్ టెర్రరిస్ట్ జోన్‌గా
పాకిస్థాన్‌కు భారత్ కొత్త పేరు పెట్టింది. ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్‌ను ''టెర్రరిస్థాన్'' అని సంబోధిస్తున్న భారత్.. జెనీవాలో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశంలో స్పెషల్ టెర్రరిస్ట్ జోన్‌గా భారత్ అభివర్ణించింది.
ఐరాసలో మానవ హక్కుల విభాగంలో భారత రెండో కార్యదర్శి మినీ దేవి కుమమ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌ను ఎస్టీజెడ్ అంటే (స్పెషల్ టెర్రరిస్ట్) జోన్‌గా అభివర్ణించారు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో నిజమైన సమస్య పాకిస్థాన్ ఉగ్రవాదమేనని ఎస్‌టీజెడ్‌లను నడుపుతున్న పాకిస్థాన్ తమను విమర్శించడం ఏంటని ఆమె నిలదీశారు.
పాకిస్థాన్‌లో ప్రత్యేక టెర్రరిస్టు జోన్‌లు ఎన్నో వున్నాయని.. సీమాంత ఉగ్రవాదాన్ని ఆపాలని.. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాలని ఎంత డిమాండ్ చేస్తున్నప్పటికీ ఆ దేశం స్పందించట్లేదని ఆరోపించారు. పాకిస్థాన్‌లో మానవ హక్కులకు భంగం కలుగుతోందని ఆరోపించారు.
కాగా... గత ఏడాది సెప్టెంబర్‌లో న్యూయార్క్‌లో జరిగిన ఐరాస సమావేశంలో పాకిస్థాన్‌ను భారత్ టెర్రరిస్థాన్ అని పిలిచిన సంగతి తెలిసిందే. ఇంకా దక్షిణాసియా మీడియా కూడా పాకిస్థాన్‌ను ప్రపంచ తీవ్రవాదాన్ని ఉత్పత్తి చేసే పరిశ్రమగా పాకిస్థాన్‌ను అభివర్ణించింది. అలాగే ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తుందంటూ బ్రిటిష్, అమెరికా మీడియా కూడా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.