Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్‌కౌంటర్: నలుగురు టెర్రరిస్టుల హతం, ప్రాణాలతో పట్టుబడిన మరో ఉగ్రవాది!

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2015 (16:59 IST)
పాకిస్థాన్ ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్లో భారత సైన్యం ఒక ముష్కరుడిని ప్రాణాలతో పట్టుకుంది. ఉత్తర కాశ్మీర్‌లోని బరాముల్లా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్లో ప్రాణాలతో ఓ ఉగ్రవాదిని భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. సజీవంగా పట్టుబడ్డ ఉగ్రవాదిని భద్రతాదళాలు ప్రశ్నిస్తున్నాయి. మొత్తం ఐదుగురు సభ్యులు గల ఈ ఉగ్రవాద గ్రూప్ యూరీ సెక్టార్ గుండా భారత్‌లోకి ప్రవేశించింది. 
 
బుధవారం నుంచి ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య కాల్పుల యుద్ధం జరిగింది. ఈ కాల్పుల్లో నలుగురు టెర్రరిస్టులు హతం కాగా, ఐదో వ్యక్తిగా మిగిలిపోయిన వ్యక్తిని భారత సైన్యం సజీవంగా పట్టుకుంది. ఇటీవలే నవేద్ అనే పాకిస్థాన్ ఉగ్రవాది కూడా ప్రాణాలతో పట్టుబడిన నేపథ్యంలో.. మరో టెర్రరిస్టును కూడా క్యాచ్ చేయడం ద్వారా భారత సైన్యం ఖాతాలో మరో గొప్ప విజయం చేరినట్లైంది.
 
ఉత్తర కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్‌లో పట్టుబడిన ఉగ్రవాది వద్ద భద్రతా బలగాలు ప్రాథమిక సమాచారాన్ని సేకరించాయి. పట్టుబడిన ఉగ్రవాది పేరు సజ్జాద్ అహ్మద్. వయసు 22 సంవత్సరాలు. పాకిస్థాన్‌బలోచ్ ప్రాంతంలోని ముజఫర్ ఘర్‌కు చెందిన సజ్జాద్‌ను విచారిస్తున్న భద్రతా దళాలు.. అనంతరం కాశ్మీర్‌కు తరలిస్తారని తెలిసింది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments