తాలిబన్ల చెర నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న ఇండియన్స్

Webdunia
ఆదివారం, 22 ఆగస్టు 2021 (14:01 IST)
ఆప్ఘనిస్థాన్‌లోని తాలిబన్ తీవ్రవాదుల చెరలో చిక్కుకున్న భారతీయులను భారత వైమానిక దళం సురక్షితంగా స్వదేశానికి చేర్చింది. కాబుల్​ నుంచి ఆదివారం ఉదయం బయలుదేరిన భారత వైమానిక దళానికి చెందిన సీ-17 విమానం భారత్​కు చేరుకుంది. 
 
ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్​లోని హిండన్​ వైమానిక స్థావరంలో ఈ విమానం ల్యాండ్​ అయింది. 107 మంది భారతీయులు సహా మొత్తం 168 మంది వాయుసేన విమానంలో భారత్​కు చేరుకున్నారు. కరోనా నేపథ్యంలో కాబుల్​ నుంచి వచ్చిన వారికి ఆర్​టీపీసీఆర్​ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
 
కాగా, ప్రస్తుతం ఆప్ఘనిస్థాన్‌లో అత్యంత దారుణ ప‌రిస్థితులు నెల‌కొనివున్న విషయం తెల్సిందే. అఫ్గాన్ తాలిబ‌న్ ఫైట‌ర్ల చేతుల్లోకి వెళ్లడంతో అక్కడి అరాచక పాలనలో జీవించలేక ప్రజలు దేశాన్ని వీడుతున్నారు. 
 
ఇప్పటికే ఐఏఎఫ్‌ రెండు C-17 విమానంలో భారత రాయబార కార్యాలయ సిబ్బందితో సహా 200 మందిని భారత్‌ ఇప్పటికే తరలించింది. మొదట సోమవారం 40 మందిని, రెండో విడుతలో భారతీయ దౌత్యవేత్తలు, అధికారులు, భద్రతా సిబ్బంది సహా 150 మందిని తరలించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments