Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘనిస్థాన్‌లో కరోనా.. వున్నది 8 కేంద్రాలే.. 100 మందికే పరీక్ష

Webdunia
గురువారం, 7 మే 2020 (17:15 IST)
ఆప్ఘనిస్థాన్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కాబూల్‌లో ఇఫ్పటికే 500మందికి ర్యాండమ్ టెస్ట్ నిర్వహించగా, 50 శాతం మంది ఇన్ఫెక్షన్‌కు గురైనట్టు తేలిందని ఐవోఎం తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్‌లో కోవిడ్-19 పరీక్షలకు ఏర్పాటైన కేంద్రాలు 8 మాత్రమే. వీటిలో రోజుకు 100 నుంచి 150 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించే వీలుంది. 
 
ఉగ్రవాదుల ప్రభావం వల్ల ఆఫ్ఘన్‌లోని 30 శాతం ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించేందుకే అవకాశం లేదు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల సగటు ఆయుర్దాయం 50 ఏళ్ళు మాత్రమే. టీబీ, హెచ్‌ఐవి, పౌష్టికాహార లోపం, క్యాన్సర్, గుండె, శ్వాస సంబంధ వ్యాధులు ఆ దేశ ప్రజల్ని పీడిస్తున్నాయి. 
 
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా బారిన పడే దేశాల్లో ఆఫ్ఘనిస్థాన్ ముందుండే అవకాశం ఉందని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా తగిన వైద్య సదుపాయాలు లేకపోవడంతో దేశ జనాభాలో దాదాపు 80 శాతం కరోనా బారిన పడే ప్రమాద చెందుతోంది. మే 5 వరకు ఆప్ఘనిస్థాన్‌లో 2900 కేసులు నమోదు కాగా, 90 మంది మరణించారు.
 
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటికే ఇరాన్, పాకిస్థాన్‌ల నుంచి 2,71,000మంది ఆఫ్ఘన్‌కు చేరుకున్నారు. వీరి ద్వారా కరోనా వాపిస్తుందన్న ఆందోళన కూడా ఆ దేశ అధికారుల్లో నెలకొంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments