Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూచిభొట్ల హంతకుడు పురింటన్ దోషిగా తేలితే 50 ఏళ్ల జైలు.. బకెట్ లైట్ల వెలుగులో?

అమెరికాలోని కన్సాస్‌లో కూచిభొట్ల శ్రీనివాస్‌‌పై విద్వేష దాడి ఉదంతం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం పార్లమెంటును కుదిపేసింది. ప్రతి విషయంపైనా ట్వీట్లు ఇచ్చే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ ఘ

Webdunia
బుధవారం, 15 మార్చి 2017 (12:15 IST)
అమెరికాలోని కన్సాస్‌లో కూచిభొట్ల శ్రీనివాస్‌‌పై విద్వేష దాడి ఉదంతం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం పార్లమెంటును కుదిపేసింది. ప్రతి విషయంపైనా ట్వీట్లు ఇచ్చే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ ఘటనపై మిన్నకుండిపోయారని విపక్షాలు ఫైర్ అయ్యాయి. భారతదేశ ప్రభుత్వం విదేశాల్లో ఉన్న భారతీయుల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
 
ఈ నేపథ్యంలో.. కన్సాస్‌లో హైదరాబాద్ టెక్కీ కూచిభొట్ల శ్రీనివాస్ ని కాల్చి చంపిన యాడమ్ పురింటన్ గురించి షాకింగ్ నిజాలు బయటికి వస్తున్నాయి. కూచిబోట్లను కాల్చి చంపడమేకాక,మరో తెలుగువాడు అలోక్ మేడసాని, తెల్ల జాతీయుడు గ్రిల్లట్ పైనా ఫైర్ చేసినందుకు ఇతనిపై రెండు హత్యా యత్నం కేసులు కూడా నమోదయ్యాయి. కోర్టు ఇతడిని దోషిగా ప్రకటిస్తే పెరోల్ లేకుండా గరిష్టంగా 50 ఏళ్ళ జైలు శిక్ష పడవచ్చు.
 
ఇక పురింటన్ అణ్వాయుధాలతో కూడిన అమెరికన్ వార్ షిప్‌లో సుమారు రెండున్నరేళ్ళు పని చేశాడని పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత చిన్నా చితకా ఉద్యోగాలు ఎన్నో చేయడమే కాక, డ్రగ్స్ కేసుల్లో పోలీసులకు పట్టుబడ్డాడు. 2013 ప్రాంతంలో సెర్చ్ వారంట్‌తో ఇతని ఇంటికి వెళ్ళిన పోలీసులు.. బేస్‌మెంట్ ఏరియాలో పెద్ద బకెట్లు, లైట్ల వెలుగులో మార్జువానా మొక్కలు పెంచుతుండడం చూసి షాక్ తిన్నారు. అలాగే 1994లో పురింటన్ ఓ సూపర్ మార్కెట్ వద్ద తన కారుతో మరో వాహనానికి యాక్సిడెంట్ చేసి అరెస్టు అయ్యాడు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments