Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరెస్ట్‌ను అధిరోహించి గిన్నిస్‌బుక్‌లో చోటు.. మస్తాన్ బాబు అదృశ్యంపై టెన్షన్!

Webdunia
సోమవారం, 30 మార్చి 2015 (16:28 IST)
ఎవరెస్ట్‌ అధిరోహించి గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించిన మల్లి మస్తాన్‌బాబు అదృశ్యంపై అటు కుటుంబసభ్యుల్లోనూ, ఇటు జిల్లా ప్రజల్లోనూ టెన్షన్‌ నెలకొంది. 76 గంటలుగా సమాచారం లభ్యం కాక కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. నెల్లూరు జిల్లా సంగం మండలం గాంధీ జనసంఘం మల్లి మస్తాన్‌బాబు స్వగ్రామం. పర్వతారోహణపై ఆసక్తితో 2006లో కేవలం 172 రోజుల్లో ఏడు పర్వతాలను అధిరోహించి గిన్నీ్‌సబుక్‌ రికార్డు సాధించారు. 
 
అనంతరం ఎవరెస్ట్‌ శిఖరంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ప్రస్తుతం ఆయన నాలుగు నెలలుగా అర్జెంటీనాలోని చిలీ పర్వతారోహణ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఎక్కడున్నా ప్రతి రోజు ఈ-మెయిల్‌ ద్వారా సోదరికి సమాచారం ఇచ్చేవారు. అయితే ఈనెల 26వ తేదీ సాయంత్రం నుంచి సోదరికి ఎలాంటి సమాచారం అందలేదు. చిలీలో వాతావరణం చాలా ఇబ్బందికరంగా ఉన్నట్లు ఆ బృందంలోని సభ్యుల నుంచి సమాచారం వచ్చింది. 
 
మస్తాన్‌బాబు అదృశ్యం విషయాన్ని కుటుంబసభ్యులు స్థానిక బీజేపీ నాయకుల ద్వారా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన విదేశాంగశాఖమంత్రి సుష్మస్వరాజ్‌తో మాట్లాడి మరిన్ని వివరాలు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో మస్తాన్ బాబు అదృశ్యంపై ఉత్కంఠ నెలకొంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments