ఒక అమ్మాయి కోసం.. జపాన్‌లో ఏకంగా రైలు నడుపుతున్నారు.. వీడియో
జపాన్‌లో ఒక అమ్మాయి కోసం ఏకంగా రైలు నడుపుతున్నారంటే నమ్ముతున్నారా? నమ్మితీరాల్సిందే. జపాన్ రైల్వేస్ రూరల్ ప్రాంతంలో కెయు, షిరటకి అనే ఒక స్టేషన్ ఉంది. ఆ స్టేషన్ నుంచి ఒకే ఒక ఒక్క హైస్కూల్ విద్యార్ధి మా
జపాన్‌లో ఒక అమ్మాయి కోసం ఏకంగా రైలు నడుపుతున్నారంటే నమ్ముతున్నారా? నమ్మితీరాల్సిందే. జపాన్ రైల్వేస్ రూరల్ ప్రాంతంలో కెయు, షిరటకి అనే ఒక స్టేషన్ ఉంది. ఆ స్టేషన్ నుంచి ఒకే ఒక ఒక్క హైస్కూల్ విద్యార్ధి మాత్రమే రైలు ఎక్కుతుంది. ఆ అమ్మాయి కోసం ఆ రైలు రోజుకు రెండుసార్లు నడుస్తుంది. ఎలాంటి ఆర్థికంగా లాభం లేని ఆ స్టేషన్‌ను మూడేళ్ల కిందటే మూసివేయాలని జపాన్ రైల్వేస్ అనుకుంది.
ఐతే హైస్కూల్ స్టూడెంట్ చదువు ఆగిపోకూడదన్న ఉద్దేశంతోనే ఆ రైల్వే స్టేషన్‌ను కంటిన్యూ చేస్తున్నారు. ఆ స్టూడెంట్ కోసం రైలు టైమింగ్ కూడా మార్చిందట జపాన్ రైల్వే. కేవలం ఒక్క విద్యార్ధి చదువు నష్టపోకూడదని తన నిర్ణయం మార్చుకున్న జపాన్ రైల్వేస్‌ను అక్కడి ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూట్యూబ్‌లో వ్యూస్ సంఖ్య పెరుగుతోంది.