Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడితే ఎంత డేంజ‌రో ఈ వీడియో చూడండి!

చాలా మంది ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుంటారు. ఇలాంటి వారు ప్రమాదాలకు గురై తృటిలో ప్రాణాలు కోల్పోతుంటారు. అలాగే, ప్రధాన రహదారులపై ఉన్నట్టుండి గుంతలు ఏర్పడుతుంటాయి. ఆకస్మికంగా ఏర్పడే ఈ గుంతల్లో పడ

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2017 (12:05 IST)
చాలా మంది ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుంటారు. ఇలాంటి వారు ప్రమాదాలకు గురై తృటిలో ప్రాణాలు కోల్పోతుంటారు. అలాగే, ప్రధాన రహదారులపై ఉన్నట్టుండి గుంతలు ఏర్పడుతుంటాయి. ఆకస్మికంగా ఏర్పడే ఈ గుంతల్లో పడి మరికొందరు దుర్మరణం చెందుతారు. 
 
ఇపుడు ఇలాంటి ప్రమాదం ఒకటి జరిగింది. చైనా రోడ్డుపై స‌డెన్‌గా పెద్ద గుంత ఏర్ప‌డింది. 32 అడుగుల వెడ‌ల్పు, 6 అడుగుల లోతు సింక్‌హోల్ అది. ఇంతలో ఓ వ్య‌క్తి స్కూట‌ర్ న‌డుపుతూ, ఫోన్ మాట్లాడుతూ వ‌చ్చి ఆ గుంత‌లో ప‌డ్డాడు. 
 
చైనాలోని గుయాంగ్జి సిటీలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఫోన్‌లో బిజీగా ఉన్న ఆ వ్య‌క్తి రోడ్డు అంత పెద్ద గుంత ఉన్న‌ది కూడా గ‌మ‌నించ‌లేదు. స్కూట‌ర్ ఏమాత్రం స్లో చేయ‌కుండా నేరుగా వ‌చ్చి అందులో ప‌డిపోవ‌డం అక్క‌డే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ‌యింది. 
 
అయితే ఇంత జ‌రిగినా అత‌నికి మాత్రం ఏమాత్రం గాయాలు కాలేదు. పైగా అత‌నే ఎలాగోలా క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చాడు. ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన గంట‌ల్లోనే వేల సంఖ్య‌లో వ్యూస్ వచ్చాయి. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడితే ఎంత డేంజ‌రో ఈ వీడియో చూస్తే మీకూ తెలుస్తుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments