Webdunia - Bharat's app for daily news and videos

Install App

20 నెలలు సమాధి వద్ద.. 11 సంవత్సరాలు భార్య శవంతో గడిపేస్తున్న భర్త.. వీడియో వైరల్!

భార్య భర్తల బంధం విడదీయరాని బంధం. ఆ ప్రేమను మరణం కూడా విడదీయలేదని అంటారు. కాగా ఒక భర్త తన భార్య చనిపోయినా కూడా ఆమెతోనే గడిపిస్తున్నాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 సంవత్సరాలుగా భార్య శవంతో గడిపే

Webdunia
గురువారం, 7 జులై 2016 (15:29 IST)
భార్య భర్తల బంధం విడదీయరాని బంధం. ఆ ప్రేమను మరణం కూడా విడదీయలేదని అంటారు. కాగా ఒక భర్త తన భార్య చనిపోయినా కూడా ఆమెతోనే గడిపిస్తున్నాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 సంవత్సరాలుగా భార్య శవంతో గడిపేస్తున్నాడు. దీంతో ఆయన భార్యపై చూపిస్తున్న ప్రేమ కొంతమందిని అబ్బురపరుస్తున్నా... మరికొందరైతే ఆయన ప్రేమ ఎంత గొప్పది.. అలాంటి భర్త ప్రేమను పొందిన భార్య ఎంత అదృష్టవంతురాలు అని కితాబునిస్తున్నారు.
 
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వియత్నాంలో క్వాంగ్ నాం ప్రావిన్స్‌లో నివసించే ఓ వ్యక్తి(55) భార్య మరణించింది. దీంతో ఆ మనిషి ఆమె ఎడబాటును  భరించలేక కుంగిపోయాడు. ఆమెను తలచుకుంటూ ప్రతి రోజూ ఏడ్చేవాడు. తన భార్యతో పాటు తాను మరణించలేక ఆమె జ్ఞాపకాలను మర్చిపోలేక ఆమె సమాధి వద్ద సుమారు 20 నెలలు గడిపాడు. సమాధి వద్ద ఉన్నప్పుడు గాలి, వాన వస్తున్నాయని భావించి ఆ భర్త ఓ ఆలోచన చేశాడు. 
 
దీంతో 2004 సంవత్సరంలో తన భార్య సమాధిని తవ్వి ఆమె హస్తికలను, మట్టిలో కలవకుండా, మిగిలిన శరీరభాగాన్ని బయటికి తీసి వాటిని కాగితం, మట్టిని ఉపయోగించి మనిషి రూపంలా తయారు చేశాడు. ఆ శరీరానికి ముఖంగా ఓ మాస్క్‌ను కూడా తగిలించాడు. అంతటితో ఊరుకోలేదు. దానికి ఒక డ్రెస్ కూడా వేశాడు. ఆ శరీరాన్ని తన ఇంటిలో పెట్టుకొని దాని పక్కనే నిద్రపోవడం అలవరచుకున్నాడు. తండ్రి పక్కనే కొడుకు కూడా గత 11 సంవత్సరాలుగా ఆ శరీరం పక్కనే నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఈ ఉదంతం విషయం బయటికి వచ్చి, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments