Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానాన్ని పక్షి ఢీకొట్టితే రూ.14 కోట్ల నష్టం వాటిల్లుతుందా?

Webdunia
శనివారం, 19 అక్టోబరు 2019 (10:38 IST)
ప్రచ్ఛన్న యుద్ధకాల సమయంలో అమెరికా అగ్ర నేతలకు రక్షణ కల్పించిన విమానాల్లో ఒకటి బోయింగ్ ఈ-6బి మెర్క్యురీ. ఈ విమానం తయారీకి పది వేల కోట్ల రూపాయల మేరకు ఖర్చు అవుతుంది. అలాంటి విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఓ పక్షి ఢీకొట్టింది. దీంతో రూ.14 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. 
 
తాజాగా వెగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అమెరికాలోని మేరీల్యాండ్‌‌లోని పట్యుక్సెంట్‌ రివర్‌ నేవల్‌ ఎయిర్‌ స్టేషన్‌లో ఈ నెల 2వ తేదీ ఓ ఘటన జరిగింది. ఈ-6బి మెర్క్యురీ విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఓ పక్షి ఢీకొట్టింది. 
 
ఆ తర్వాత విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నా నష్టం మాత్రం భారీగానే జరిగింది. విమానంలోని నాలుగు ఇంజిన్లలో ఒకటి దెబ్బతినడంతో ఏకంగా రూ.14 కోట్ల నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు. విమానం ఖరీదు పదివేల కోట్ల రూపాయలకు పైనే కాగా, ఈ ప్రమాదాన్ని వైమానిక దళం ఎ-క్లాస్ ప్రమాదంగా పేర్కొంది.
 
నిజానికి పక్షి కారణంగా దెబ్బతిన్న విమానానికి చాలా చరిత్ర ఉంది. ఈ-6బి మెర్క్యురీ రకం విమానమైన ఇది  ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికా నేతలకు రక్షణ కల్పించింది. అంతేకాదు, అణుదాడులకు కూడా దీనిని ఉపయోగించారు. అలాంటి విమానం చిన్నపాటి పక్షి ఢీకొట్టడంతో అపార నష్టంవాటిల్లింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments