Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాన్ దేశంలో 9 మంది పాకిస్థాన్ పౌరుల కాల్చివేత...

వరుణ్
సోమవారం, 29 జనవరి 2024 (15:24 IST)
ఇరాన్ దేశంలో తొమ్మిది మంది పాకిస్థాన్ కూలీలను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపేశారు. ఇంట్లోకి చొరబడి మరీ ఈ దారుణానికి పాల్పడ్డారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. శాంతి చర్చల కోసం ఇరాన్‌ మంత్రి పాకిస్థాన్ దేశ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమైన ఒక్క రోజు ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. అయితే, ఈ దుశ్చర్యను విధ్వంసకర శక్తుల పనిగా ఇరాన్ అభివర్ణించింది. 
 
ఈ ఘటనపై పాకిస్థాన్ తీవ్రంగా స్పందించింది. దీనిపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని, ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పాక్ విదేశాంగశాఖ డిమాండ్ చేసింది. ఈ ఘటనకు ఏ గ్రూపు ఇప్పటి వరకు బాధ్యత ప్రకటించలేదు. ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ చర్చల కోసం పాకిస్థాన్‌లో పర్యటించడానికి ఒక్క రోజు ముందు ఈ ఘటన జరగడం గమనార్హం. ఇరు దేశాల మధ్య సోదర సంబంధాన్ని దెబ్బతీసేందుకు విధ్వంసకర శక్తులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోవని ఇరాన్ స్పష్టం చేసింది.
 
మరోవైపు, బలూచిస్థాన్ ప్రావిన్సులోని జైషే మహ్మద్, అల్ అదిల్ ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ ఈ నెల 16న క్షిపణి దాడులకు దిగిన విషయం తెల్సిందే. ఇది పాక్ - ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కారణమైంది. ఇరాన్ దాడిలో ఇద్దరు చిన్నారులు మరణించారని పేర్కొన్న పాకిస్థాన్.. 18న ఇరాన్‌వోని సిస్తాన్ - బలూచిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 9 మంది మరణించారు. ఈ ఘటనలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ తాజా ఘటన మరింత అగ్గిరాజేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments