Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్జించిన రష్యా వినానాలు.. మరో వార్ ఫ్లైట్‌ను కూల్చేసిన ఉక్రెయిన్‌

Webdunia
గురువారం, 24 ఫిబ్రవరి 2022 (17:57 IST)
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధ విమానాలు గర్జించాయి. దీనికి ఉక్రెయిన్ కూడా ధీటుగానే స్పందిస్తుంది. రష్యాకు చెందిన యుద్ధ విమానాలను కూల్చివేస్తుంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు ఆరు యుద్ధ విమానాలను కూల్చివేయగా, ఐదుగురు రష్యా వైమానికదళ సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్టు ప్రకటించింది. 
 
తాజాగా మరో యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. ఈ విమానాన్ని లుహాన్స్క్‌ ప్రాంతంలో తమ బలగాలు కూల్చివేశాయని వెల్లడించింది. ఇప్పటివరకు రష్యాకు చెందిన మొత్తం 7 విమానాలు, ఒక హెలికాఫ్టర్‌ను కూల్చివేసిట్టు ఉక్రెయిన్ అధికారికంగా ప్రకటించింది. 
 
అయితే, ఉక్రెయిన్ ప్రకటనను రష్యా తోసిపుచ్చింది. ఉక్రెయిన్ చెబుతునదాంట్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. మరోవైపు ఉక్రెయిన్‌పై తాము చేపట్టిన సైనిక చర్యను రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ సమర్థించుకున్నారు. ఉక్రెయిన్‌ను ఆక్రమించుకునే ఉద్దేశ్యం తమకు లేదని తెలిపారు. కేవలం ఉక్రెయిన్ సైనిక స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్టు చెప్పారు. తమ దాడుల లక్ష్యమే ఉక్రెయిన్ సైనిక శక్తిని నిర్వీర్యం చేయడమని ఆయన స్పష్టంచేశారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments