Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం - ఆరుగురు భారతీయుల మృతి

Webdunia
శుక్రవారం, 4 ఆగస్టు 2023 (10:19 IST)
మెక్సికో నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. కొందరు ప్రయాణికులతో వెళుతున్న బస్సు లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో 17 మంది చనిపోగా వీరిలో ఆరుగురు భారతీయులు ఉన్నారు. 
 
నాయారిట్ రాష్ట్రంలో రాజధాని టెపిక్‌కు కొద్ది దూరంలో ఉన్న బర్రాంకా బ్లాంకా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. 40 మంది ప్రయాణికులతో టియువానా వైపు వెళుతున్న బస్సు అకస్మాత్తుగా అదుపు తప్పి లోయలో పడిపోయినట్టు అక్కడి అధికారులు తెలిపారు. అయితే, ప్రమాదానికి కారణమేంటో ఇంకా తెలియరాలేదు.
 
ఈ ప్రమాద వార్త తెలియగానే పోలీసులు, అత్యవసర సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. బస్సు 50 మీటర్ల లోతున్న లోయలో పడిపోవడంతో సహాయక చర్యలు చేపట్టడం కష్టంగా మారిందని అత్యవసర సిబ్బంది పేర్కొన్నారు. ఘటనలో మరణించిన భారతీయులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments