Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రంప్ నా అనుమతి లేకుండా నా వ్యక్తిగత భాగాలను తాకాడు... యోగా టీచర్ ఆరోపణ

అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ప్రధాన అభ్యర్థులు హిల్లరీ క్లింటన్, డోనాల్డ్ ట్రంప్ హోరాహోరీగా దూసుకుపోతున్నారు. ఆరోపణలు, ఘాటైన విమర్శలు, మాటల యుద్ధంతో ఎన్నికల ప్రచారాన్ని బాగా వేడెక్కించేస్తున్నారు. న

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2016 (14:44 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ప్రధాన అభ్యర్థులు హిల్లరీ క్లింటన్, డోనాల్డ్ ట్రంప్ హోరాహోరీగా దూసుకుపోతున్నారు. ఆరోపణలు, ఘాటైన విమర్శలు, మాటల యుద్ధంతో ఎన్నికల ప్రచారాన్ని బాగా వేడెక్కించేస్తున్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని మన పెద్దలు చెప్తుంటారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌లో అది ఏకోశాన కనిపించడం లేదు. తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌పై ఆరోపణల విషయంలో ఆయన నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. తాజాగా హిల్లరీపై ట్రంప్ చేసిన ఆరోపణలు అందరినీ అవాక్కయ్యేలా చేసాయి. 
 
హిల్లరీ క్లింటన్ డ్రగ్స్ తీసుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారనేది ట్రంప్ తాజా ఆరోపణ. తనతో ఇటీవల జరిగిన డిబేట్లో ఆమె ఒక రకమైన డ్రగ్ తీసుకుని వచ్చారని ట్రంప్ ఆరోపించారు. కావాలంటే, ఆమెతో పాటు తనకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సవాలు కూడా విసిరారు. ఆరోపణలతో ఈ మధ్య కాలంలో హిల్లరీతో పోలిస్తే ట్రంప్ ప్రచారంలో వెనకబడుతున్న సంగతి తెలిసిందే. మరోపక్క తొమ్మిది మంది మహిళలు ట్రంప్ తమతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించగా.. తాజాగా ఓ యోగా ట్రైనర్ కరెనా వర్జీనియా(45) ట్రంప్ ప్రవర్తనపై తీవ్రంగా విమర్శించింది.
 
పద్దెనిమిది ఏళ్ల కిందట(1998లో) యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ప్లేయర్స్‌కు ట్రైనర్‌గా పనిచేయగా.. ఆ సమయంలో ట్రంప్ తన గురించి అసభ్యంగా మాట్లాడాడాని... తన వ్యక్తిగత అవయవాలను తన అనుమతి లేకుండా తాకాడని వర్జీనియా ఆరోపించింది. మొదట ఓ వ్యక్తితో ట్రంప్ మాట్లాడుతూ.. ఆమెను చూడు.. గతంలో ఇలాంటి అందమైన అప్సరసను ఎక్కడా చూడలేదు. ఓసారి ఆమె కాళ్లను గమనించు అని కామెంట్ చేశారు. 
 
ఆపై నా చేతి పట్టుకుని నన్ను గట్టిగా దగ్గరకు లాక్కుని వ్యక్తిగత అవయవాలను బలవంతంగా టచ్ చేశాడు' అంటూ వర్జీనియా పేర్కొంది. అప్పుడు తన వయసు 27 ఏళ్లు అని.. ఆ సమయంలో తాను నిస్సహాయురాలిగా ఉండిపోయానని, షార్ట్ డ్రెస్‌తో పాటు హై హీల్స్ వేసుకోవడంతో సరిగ్గా స్పందించకలేకపోయానని ఆవేదన వ్యక్తంచేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments