Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రష్‌ చేసుకోనని మారాం చేసిన కన్నబిడ్డను హత్య చేసిన కసాయి తల్లి

బ్రష్ చేసుకోనని మారం చేసిన కన్నబిడ్డను హత్య చేసిందో కసాయి తల్లి. ఈ దారుణం అమెరికాలో జగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... అమెరికాలోని మేరిల్యాండ్‌లో గల గైటర్స్‌ బర్గ్‌లో ఇరవై ఏళ్ల

Webdunia
సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (13:59 IST)
బ్రష్ చేసుకోనని మారం చేసిన కన్నబిడ్డను హత్య చేసిందో కసాయి తల్లి. ఈ దారుణం అమెరికాలో జగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... అమెరికాలోని మేరిల్యాండ్‌లో గల గైటర్స్‌ బర్గ్‌లో ఇరవై ఏళ్ల హెర్నాడ్జ్‌ రైవస్‌ తన కుమార్తె బాత్రూంలో అచేతనంగా పడిపోయిందని అత్యవసర సేవలకు నెంబర్‌ 911కు ఫోన్‌ చేసింది.
 
తన కుమార్తె స్నానం చేయటానికి బాత్‌రూంలోకి వెళ్లిన 15 నిమిషాలకు పడిపోయి టబ్‌కు తలకొట్టుకుందని అధికారులకు చెప్పింది. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమె ఒంటిపై పలు గాయాలు ఉన్న విషయాన్ని గుర్తించారు. తలకు తగిలిన గాయం తీవ్రంగా ఉండటంతో ది చిల్డ్రన్స్‌ నేషనల్‌ మెడికల్‌ సెంటర్‌కు తరలించారు.
 
అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి కన్నుమూసింది. దీంతో పోలీసులు హెర్నాడ్జ్‌ను తమదైనశైలిలో విచారించగా నిజం బయటపెట్టింది. తన కాలుతో చిన్నారి కడుపులో కొట్టడంతో ఆ బాలిక గోడను కొట్టుకొని పడిపోయినట్లు వెల్లడించింది. బ్రష్‌ చేసుకోని కారణంగానే తాను కొట్టినట్లు ఆమె పేర్కొంది. దీంతో పోలీసులు ఆమెపై అభియోగాలు మోపి జైలుకు తరలించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bellamkonda Sai Sreenivas- బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై కేసు నమోదు

Kamal: కమల్ హాసన్ థగ్ లైఫ్ ట్రైలర్ చెన్నై, హైదరాబాద్‌లో ఆడియో, విశాఖపట్నంలో ప్రీ-రిలీజ్

Samantha: రాజ్ నిడిమోరు-సమంతల ప్రేమోయణం.. శ్యామిలీ భావోద్వేగ పోస్టు

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

మే 16న థియేటర్లలో హైబ్రిడ్ 3డి చిత్రం 'లవ్లీ' రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments