Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైజీరియాలో మసీదు వద్ద వరుస బాంబు పేలుళ్లు : 35 మంది మృతి

Webdunia
శనివారం, 29 నవంబరు 2014 (09:07 IST)
ఉత్తర నైజీరియాలోని కానో నగరంలో మసీదు వద్ద వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 35 మంది మరణించగా... 150 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వివిధ ఆస్పత్రులకు తరలించారు. 
 
ఈ విషయమై నగర పోలీసు కమిషనర్ శామ్యూల్ లీము మాట్లాడుతూ.. శుక్రవారం మధ్యాహ్నం మసీదులో ప్రార్థనలు ప్రారంభమయ్యే సమయంలో ఆగంతకులు మసీదు వద్ద కాల్పులు జరిపి పరారయ్యారని చెప్పారు.
 
ఈ కాల్పుల్లో పలువురు గాయపడ్డారని.... ఆ వెంటనే పేలుళ్లు జరిగాయని పేర్కొన్నారు. ఈ పేలుళ్లకు ఇంత వరకు ఏ తీవ్రవాద సంస్థ బాధ్యత వహించలేదన్నారు. 
 
నైజీరియాలోని బోకోహరామ్ తీవ్రవాదులే ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తున్నామని చెప్పారు. ఈ సంస్థ ఏడాది జరిపిన విధ్వంసంలో దాదాపు 3 వేలమందికి పైగా మరణించారని పోలీసు కమిషనర్ శామ్యూల్ లీము వెల్లడించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments