Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధికారుల అలక్ష్యం... జీ20 నేతల వివరాలు నెట్‌లో లీక్ ఔట్..!

Webdunia
సోమవారం, 30 మార్చి 2015 (17:48 IST)
ఆస్ట్రేలియా అధికారులు అలక్ష్యం కారణంగా అంతర్జాతీయ నేతల వివరాలు బహిర్గతమైన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గత ఏడాది నవంబర్ లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ లో జీ-20 తొమ్మిదో శిఖరాగ్ర సదస్సు జరిగిన విషయం తెలిసిందే. 
 
ఆ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు 31 మంది వివిధ దేశాధిపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి డేటాను సేకరించారు. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా అధికారులు ఆ దేశాధినేతల నుంచి సేకరించిన వివరాలను పొరపాటున ఇంటర్ నెట్‌లో పోస్ట్ చేశారు. 
 
ఈ విధంగా లీకైన వాటిలో ఆ నాయకుల పాస్ పోర్టు, వ్యక్తిగత వివరాలు, వారి ప్రయాణ వివరాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్, జపాన్ ప్రధాని షింజో అబే, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, ఇండోనేషియా అధ్యక్షుడు జొకో విడోడోల వివరాలు బహిర్గతమైనట్టు సమాచారం.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments